President Elections: ఎన్డీయే(NDA) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణాలో పర్యటించాల్సి ఉంది. అయితే హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఓ వైపు రాష్ట్రంలో భారీ వర్షాలు.. మరోవైపు సమయాభావం వల్ల రాలేకపోతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర మేధావులతో నేడు ద్రౌపతి సమావేశం కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె.. తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉన్న ద్రౌపది ముర్ము బిజీబిజీగా ఉన్నారు.
ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ సూచన దృష్ట్యా, షెడ్యూల్ చేయబడిన పర్యటన వాయిదా పడిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థానాలున్న వైసీపీ తోపాటు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా ఎన్డీయే అభ్యర్థి అయిన ద్రౌపతికి తమ మద్దతు ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..