Minister Indrakaran Reddy: నిర్మల్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

|

Jan 01, 2021 | 9:24 PM

Minister Indrakaran Reddy : తెలంగాణ రాష్ట్రంలో పురాతన కోటలను అభివృద్ధి పరిచేందుకు పర్యాటక రంగంతో నిర్మల్‌ పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర అటవీ...

Minister Indrakaran Reddy: నిర్మల్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి
Follow us on

Minister Indrakaran Reddy : తెలంగాణ రాష్ట్రంలో పురాతన కోటలను అభివృద్ధి పరిచేందుకు పర్యాటక రంగంతో నిర్మల్‌ పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని శ్యామ్‌ ఘడ్‌ కోట చుట్టూ మున్సిపల్‌ నిధులు రూ.16.50 లక్షలతో ఏర్పాటు చేసిన లైటింగ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2020 సంవత్సరంలో కరోనాతోనే గడిచిపోయిందని, 2021లోనైనా ప్రతి ఒక్కరికి కొత్తదనం రావాలని ఆయన అన్నారు.

జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తూ నిర్మల్‌ జిల్లాను మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు. అలాగే కంచరోని చెరువులో బోటింగ్‌ సౌకర్యం కల్పించినట్లయితే పట్టణ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని, పురాతన సోన్‌ బ్రిడ్జిని అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టాలని పర్యాటక శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లినందుకు మరోసారి ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు. కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడంలో నిర్మల్‌ మున్సిపాలిటీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. అంతకు ముందు మంజులాపూర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన హైమాస్ట్‌ లైట్లను మంత్రి ప్రారంభించారు.

GHMC Mayor Bonthu Rammohan: బల్దియాపై జెండా ఎగరేసేది టీఆర్‌ఎస్‌ పార్టీయే.. బొంతు రామ్మోహన్‌ సంచలన వ్యాఖ్యలు