నగరంలో కురిసిన భారీ వర్షాలకు 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. నగరంలో 53 చెరువులు దెబ్బతిన్నాయని.. త్వరలోనే మరమ్మతులు చేయిస్తామన్నారు. చెరువుల కబ్జాలపై విచారణ జరిపి అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిటీలో ఏటా సగటున 800 మి.మీల వర్షపాతం నమోదవుతుందని.. కానీ ఈ సంవత్సరం కేవలం వారం రోజుల్లోనే 700 మి.మీల వర్షపాతం నమోదైందని తెలిపారు. జంట నగరాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆ శాఖ కమిషనర్, అధికారులతో జలసౌధలో రజత్ కుమార్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. చెరువులకు గండ్లు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 15 తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్పెషల్ టీమ్స్ చెరువులను పరిశీలించిన అనంతరం మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తామని వివరించారు. చెరువుల పునరుద్ధరణకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ రూ.2 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Also Read :
“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్