AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలో ప్రయాణిస్తూ కరోనా రోగి మృతి.. !

కరోనా బారిన పడ్డ ఓ ప్రయాణికురాలు విమానంలోనే మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె కరోనాతో చనిపోయినా, ఆమెకు వైరస్ సోకిన్నట్టు అధికారులు గుర్తించలేకపోవడం గమనార్హం.

విమానంలో ప్రయాణిస్తూ కరోనా రోగి మృతి.. !
Balaraju Goud
|

Updated on: Oct 22, 2020 | 12:53 PM

Share

కరోనా బారిన పడ్డ ఓ ప్రయాణికురాలు విమానంలోనే మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె కరోనాతో చనిపోయినా, ఆమెకు వైరస్ సోకిన్నట్టు అధికారులు గుర్తించలేకపోవడం గమనార్హం. జులై 24న టెక్సాస్‌కు చెందిన మహిళ స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో లాస్ వేగాస్ నుంచి డల్లాస్‌కు వెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలొదిలింది. విమానం గాల్లో ఉండగానే ప్రయాణికురాలు స్పృహ‌త‌ప్పడంతో అల్బూక్వర్క్‌ విమానాశ్రయానికి పైలట్ అత్యవసరంగా మళ్లించారు.. అప్పటికే ఆమె చనిపోయిందని అల్బూక్వర్క్ ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి స్టీఫెన్ కిట్స్ తెలిపారు.

అయితే, విమానం ప్రయాణంలో అచేతనస్థితిలోకి వెళ్లిపోయింది ఓ మహిళ. ఆమెకు ఊపిరి ఆగిపోయిందని పోలీసు నివేదిక తెలిపింది. విమానంలో ఉండగా స్పృహ‌ కోల్పోయిన ప్రయాణికురాలికి క్యాబిన్ క్రూ సీపీఆర్ నిర్వహించడానికి ప్రయత్నించాడని పేర్కొంది. విమానం అత్యవసరంగా అల్బూక్వర్క్ విమానాశ్రయంలో దింపిన తర్వాత సిబ్బంది ఆమెను కాపాడటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వివరించింది. మహిళ మరణం గురించి తొలిసారి వెల్లడించిన డల్లాస్ కౌంటీ జడ్జి కార్యాలయం.. ఆమెకు అనారోగ్య సమస్యలున్నట్టు తెలిపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు మాత్రం కొవిడ్-19 వల్లే ఆమె చనిపోయిందని, అంతేకాకుండా ఆమెకు ఆస్తమా, ఇతర అనారోగ్య కారణాలు కూడా దోహదపడ్డాయని తేలింది.

ఎయిర్‌పోర్ట్ సిబ్బంది మాత్రం ఆమెకు కరోనా వైరస్ బారినపడ్డ విషయాన్ని గుర్తించలేకపోయారని, దీనిని సాధారణ అనారోగ్యంగా భావించారు. అయితే, డల్లాస్ కౌంటీ మాత్రం ఆమె కరోనాతో చనిపోయినట్టు ప్రకటించింది. ‘తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో అంతరాష్ట్ర ఎయిర్‌లైన్స్ విమానంలో ఆమె చనిపోయింది’అని తెలిపింది. మహిళ కుటుంబసభ్యులు, స్నేహితులకు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Follow Us
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా..
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా..
రాత్రిపూట కుక్కలు ఎందుకు మొరుగుతాయి.. నిజంగా దయ్యాలు కనిపిస్తాయా?
రాత్రిపూట కుక్కలు ఎందుకు మొరుగుతాయి.. నిజంగా దయ్యాలు కనిపిస్తాయా?
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్‌ చేస్తే..
వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్
వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ధురంధర్ 2 షోలో ల్యాప్‌టాప్‌తో టెక్కీ హల్చల్
కామద ఏకాదశి ఎప్పుడు..? వ్రతం, పూజా, శుభ ముహూర్తం మీ కోసం!
కామద ఏకాదశి ఎప్పుడు..? వ్రతం, పూజా, శుభ ముహూర్తం మీ కోసం!
వారానికి ఒకసారి ఈ చిన్న పని చేస్తే చాలు.. ఈ ఈగలు పరార్!
వారానికి ఒకసారి ఈ చిన్న పని చేస్తే చాలు.. ఈ ఈగలు పరార్!
పతనం కాదు పాతాళానికే.! బంగారం రూ. లక్ష, వెండి రూ. 2 లక్షల దిగువకు
పతనం కాదు పాతాళానికే.! బంగారం రూ. లక్ష, వెండి రూ. 2 లక్షల దిగువకు
గురకకు ఇలా గుడ్ బై చెప్పండి.. ఈ సింపుల్ చిట్కాలతో హాయిగా..
గురకకు ఇలా గుడ్ బై చెప్పండి.. ఈ సింపుల్ చిట్కాలతో హాయిగా..
ఆరు బంతుల్లో 15 రన్స్ టార్గెట్.. పంత్ రియాక్షన్ ఇదీ
ఆరు బంతుల్లో 15 రన్స్ టార్గెట్.. పంత్ రియాక్షన్ ఇదీ
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..
ఫ్యాన్ రెక్కల మీద దుమ్ము, గ్రీజును వదిలించే మ్యాజిక్ ట్రిక్..