Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
మహారాష్ట్రలో పిడుగుపాటుకు ఓ ఎద్దు చనిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రైతు కుటుంబం హృదయవిదారక పరిస్థితిని ఎదుర్కొంది. కొత్త ఎద్దును కొనుగోలు చేసే స్థోమత లేక రైతు కుమారుడే ఎద్దుకు జోడీగా నాగలి లాగి పొలం దున్నాడు. విత్తనాలు వేసే సమయం వృథా కాకూడదనే ఆలోచనతో చేసిన ఈ ప్రయత్నం అందరినీ కదిలిస్తోంది.
ఒక్క పిడుగుపాటు ఆ రైతు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని, కోలుకోలేని ఆర్థిక కష్టాన్ని నింపింది. ప్రాణప్రదంగా చూసుకునే ఎద్దు చనిపోవడంతో.. విత్తనాలు వేసే సమయానికి పొలం పనులు ఆగిపోయే దుస్థితి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక, ఎద్దుకు జోడీగా రైతు కుమారుడే స్వయంగా భుజం కలిపి నాగలి లాగిన హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. నాగ్‌పూర్ జిల్లా సెలోటీ గ్రామానికి చెందిన తన్బా మార్‌ఘడే అనే రైతు జూన్ 25న తన ఎద్దుల జోడీతో పొలం పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఒక ఎద్దు అక్కడికక్కడే మృత్యువాత పడింది. చేతిలో పైసా లేని స్థితిలో, కొత్త ఎద్దును కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మరోవైపు వర్షాలు పడుతుండడంతో విత్తనాలు వేసే సమయం మించిపోతోంది. ఈ క్రమంలో ఆ రైతు కుమారుడు సమయస్పూర్తితో ఆలోచించాడు. తానే కాడెద్దుగా మారాడు. సమయం వృథా అయితే ఏడాది పొడవునా పస్తులుండాల్సి వస్తుందనే ఆవేదనతో.. ఆ రైతు కుమారుడు మరో ఎద్దుతో పాటు తానూ కాడి మోశాడు. ఎద్దుకు జోడీగా నిలబడి పొలంలో దుక్కి దున్నాడు. కొత్త ఎద్దును కొనేందుకు డబ్బులు లేకపోవడం వల్లే తన కొడుకు ఇలా ఎద్దులా మారాల్సి వచ్చిందని ఆ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..

