తెలంగాణ ‘రైతుబంధు’ నిధులు విడుదల!

| Edited By:

Jun 03, 2019 | 7:28 PM

తెలంగాణ రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.6900 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిధుల‌ విడుదలకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఒక పంటకు రూ.5వేలు అందించనున్నారు. […]

తెలంగాణ రైతుబంధు నిధులు విడుదల!
Follow us on

తెలంగాణ రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.6900 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నిధుల‌ విడుదలకు సంబంధించి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచుతూ గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీంతో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఒక పంటకు రూ.5వేలు అందించనున్నారు. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సాయాన్ని రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ నెల 7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల పరోక్ష ఎన్నిక జరిగిన అనంతరం రైతుబంధు సాయాన్ని పంపిణీచేసేందుకు తెలంగాణ‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది.