తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్… డీఏ పెంపు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే కరువు భత్యం (డీఏ)ను 3.144 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న డీఏ 27.248 నుంచి 30.392 శాతానికి పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల జీతంతో కలిపి జూన్ భత్యం అందించనున్నారు. ఉద్యోగులకు వచ్చే నెల కరువు భత్యం […]
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే కరువు భత్యం (డీఏ)ను 3.144 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న డీఏ 27.248 నుంచి 30.392 శాతానికి పెరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల జీతంతో కలిపి జూన్ భత్యం అందించనున్నారు. ఉద్యోగులకు వచ్చే నెల కరువు భత్యం అందనుంది. జూలై 2018 నుంచి 31 మే 2019 వరకు ఉన్న ఏరియర్స్‌ను జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తమకు రావాల్సిన పీఆర్సీ వాయిదా పడుతుండటంపై ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది.