లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. అయితే రూ.2.50 లక్షలు మీ సొంతం!

ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. స్వచ్ఛమైన ప్రేమ.. కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. అందుకే చాలామంది యువత కులాంతర వివాహాలే చేసుకుంటున్నారు. ఇక ఇలా కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారికి ఓ శుభవార్త. ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలందరికి రూ.2.50 లక్షల నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో రూ.50 వేలు ఉన్న ఈ ఆర్ధిక సాయాన్ని ఐదు రేట్లు పెంచి రూ.2.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ […]

లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. అయితే రూ.2.50 లక్షలు మీ సొంతం!
Follow us

|

Updated on: Nov 02, 2019 | 1:52 AM

ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. స్వచ్ఛమైన ప్రేమ.. కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. అందుకే చాలామంది యువత కులాంతర వివాహాలే చేసుకుంటున్నారు. ఇక ఇలా కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారికి ఓ శుభవార్త. ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలందరికి రూ.2.50 లక్షల నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

గతంలో రూ.50 వేలు ఉన్న ఈ ఆర్ధిక సాయాన్ని ఐదు రేట్లు పెంచి రూ.2.50 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపోతే ఈ నజరానా వర్తించడంలో కూడా కొన్ని కండీషన్స్ అప్లై అంటున్నారు.

లవ్ మ్యారేజ్ ఖచ్చితంగా కులాంతర వివాహమే అయ్యి ఉండాలి. అలా కాకుండా ఒకే కులం వారు ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ నగదు లభించదు. అంతేకాకుండా వధూవరుల్లో ఎవరో ఒకరు ఎస్సీ అయి ఉండాలి. ఒకవేళ బీసీలు.. వేరే కులం వారిని పెళ్లి చేసుకుంటే.. బీసీ కార్పొరేషన్ ఈ నజరానాను అందిస్తుంది. కులం అనే మహమ్మారిని రూపుమాపడానికి, ఎస్సీల్లో మార్పు తేవడానికి నజరానాను పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇద్దరూ అర్ధం చేసుకుని.. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్న జంటలు ప్రేమ వివాహాలు చేసుకుంటే ఫర్వాలేదు గానీ.. జీవితంలో స్థిరపడకుండా.. ప్రేమ అనే పేరుతో లస్ట్ అనే మైకంలో మునిగిపోయే.. ప్రేమ వివాహం చేసుకుంటే అది ఇద్దరికీ మంచిది కాదని ప్రేమికులు గ్రహించాలి.

Latest Articles
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..