జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉద్యోగులకు రొటేషన్ డ్యూటీలు

గ్రేటర్‌ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్‌ డ్యూటీల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉద్యోగులకు రొటేషన్ డ్యూటీలు

Updated on: Jul 07, 2020 | 10:17 AM

గ్రేటర్‌ పరిధిలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్‌ డ్యూటీల గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగుల్లో 50 శాతం మంది రోజు విడిచి రోజు గానీ వారం విడిచి వారం గానీ విధులకు హాజరు కావాలని ఆదేశించారు. గతంలో జారీచేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ నెల 4తో ముగిసింది. దీంతో ఈ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులు విధిగా కరోనా నిబంధనలు అమలు చేస్తూ భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు. ఎక్కువ శాతం ఆన్ లైన్ లోనే సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు చొరవ చూపాలని సూచిస్తున్నారు.