ఇందుకే దుబ్బాకలో ఘోరమైన పరిస్థితి: టీ కాంగ్రెస్
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఓటమి దిశగా పయనిస్తుండంపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తనదైన విశ్లేషణ చేశారు. దుబ్బాక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల సొంత మండలాలని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కి చాలా టఫ్ నియోజక వర్గం ఇదని అన్నారు. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని, అయితే, తమ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు వస్తాయని అనుకోలేదని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మూడుసార్లు ఓడిపోయారనే సానుభూతి అక్కడ ఉందన్నారు. ఇక, టీఆర్ఎస్ […]
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఓటమి దిశగా పయనిస్తుండంపై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ తనదైన విశ్లేషణ చేశారు. దుబ్బాక టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల సొంత మండలాలని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కి చాలా టఫ్ నియోజక వర్గం ఇదని అన్నారు. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని, అయితే, తమ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు వస్తాయని అనుకోలేదని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మూడుసార్లు ఓడిపోయారనే సానుభూతి అక్కడ ఉందన్నారు. ఇక, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత భర్త పోయారనే సానుభూతి ప్రజల్లో ఉందని సంపత్ కుమార్ పంచనామా చేశారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న నేతలను తమ వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ విజయవంతమైందని ఆయన వ్యాఖ్యానించారు.