ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలికి తీవ్ర గాయం..
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన అతి కష్టం మీద నడుస్తున్నారు. మోకాలి వద్ద పెద్ద బ్యాండేజ్ వాకింగ్ క్రచెస్ సహాయంతో నడుస్తున్న ఫొటోను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పంచుకుంది. తమ ప్రియతమ పీసీసీ చీఫ్ త్వరగా కోలుకోవాలంటూ..

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మోకాలికి తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన అతి కష్టం మీద నడుస్తున్నారు. మోకాలి వద్ద పెద్ద బ్యాండేజ్ వాకింగ్ క్రచెస్ సహాయంతో నడుస్తున్న ఫొటోను కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పంచుకుంది. తమ ప్రియతమ పీసీసీ చీఫ్ త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఆకాంక్షిస్తూ పోస్ట్ చేసింది. అయితే ఉత్తమ్ కుమార్‌కు గాయం ఎలా అయిందన్న విషయం తెలియరాలేదు. కాగా ‘యుద్ధ విమానాలు నడిపే మాజీ పైలెట్ మాత్రమే కాదు.. పుట్టుకతోనే పోరాటయోధుడు. ఉత్తమ్ గారు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు’ మాజీ మంత్రి గీతా రెడ్డి.
Not just former fighter pilot, a born fighter as well. We wish @UttamTPCC garu a speedy recovery. pic.twitter.com/1p85jC4gAO
— Dr. J Geeta Reddy ?? (@drjgeetareddy) August 1, 2020

Read More:
బిగ్ బ్రేకింగ్ః కరోనాతో మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి
విశాఖ ‘షిప్ యార్డు ప్రమాద ఘటన’పై సీఎం జగన్ ఆరా..
‘ఆత్మ నిర్భర్ భారత్ లోగో’ తయారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు టీ షర్ట్స్, జీన్స్ ధరించడం నిషేధం!



