రష్యాలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే.. గత కొద్ది రోజులుగా రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,462 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,45,443కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 6,38,410 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం నాడు 8,755 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని రష్యన్ అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి గడిచిన 24 గంటల్లో 95 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రష్యా వ్యాప్తంగా కరోనా బారినపడి 14,058 మంది మరణించారు. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Read More
ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు
రాజౌరీ సెక్టార్‌లో పాక్ కాల్పులు.. జవాన్ వీరమరణం
ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు