నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా కొత్తగా రూపొందించిన మున్సిపల్‌చట్టం, రెవెన్యూ శాఖ ప్రక్షాళన పై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ, మహారాష్ట్ర సీఎంలు రానున్నందున ముగ్గురు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చ కొచ్చే అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కొత్తగా కొలువుదీరనున్న జిల్లా, మండల పరిషత్‌ పాలకవర్గాలకు నిధుల అందజేత, విధుల కల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ […]

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

Edited By:

Updated on: Jun 18, 2019 | 6:58 AM

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రధానంగా కొత్తగా రూపొందించిన మున్సిపల్‌చట్టం, రెవెన్యూ శాఖ ప్రక్షాళన పై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ, మహారాష్ట్ర సీఎంలు రానున్నందున ముగ్గురు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చ కొచ్చే అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, కొత్తగా కొలువుదీరనున్న జిల్లా, మండల పరిషత్‌ పాలకవర్గాలకు నిధుల అందజేత, విధుల కల్పనపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖల విలీన అంశం కూడా చర్చకు రానుంది. ఇక మెడికల్‌ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపును కేబినెట్‌ ఆమోదించనుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలకు జిల్లాల్లో ఎకరం చొప్పున భూమి కేటాయింపునకు కూడా ఆమోదం తెలపనుంది.