Telangana Election: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు..

నవంబర్ 29, 30 తేదీల్లో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. తిరిగి డిసెంబర్ 1 శుక్రవారం అన్ని స్కూల్స్, కళాశాలలు తెర్చుకోనున్నాయి. అదే విధంగా ఇతర జిల్లాల్లో కూడా విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు.

Telangana Election: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు..
School Students

Updated on: Nov 28, 2023 | 4:16 PM

పోలింగ్‌ పండుగకు వేళయింది.. ప్రచారానికి ఇంకా కొన్నిగంటల మాత్రమే గడువు మిగిలింది. తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ నవంబర్ 30 గురువారం జరగనుంది. పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి..ఎలక్షన్‌లో ఈసారి అదనంగా 14వేల 500 బ్యాలెట్‌ యూనిట్లు ఉపయోగిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. సమస్యాత్మక ప్రాంతాలు 10వేలు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో మూడంచెల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. నవంబర్ 29, 30 తేదీల్లో సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1న తిరిగి విద్యాసంస్థలు తెర్చుకుంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో తొలివిడతగా నవంబర్ 30 ఉదయం పోలింగ్ నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వం ముగిస్తుంది. ఇప్పటికే దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్ 30 తెలంగాణ పోలింగ్ కూడా పూర్తయ్యాక డిసెంబర్ 3వ తేదీన మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు.

అంటే నవంబర్ 29, 30 తేదీల్లో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. తిరిగి డిసెంబర్ 1 శుక్రవారం అన్ని స్కూల్స్, కళాశాలలు తెర్చుకోనున్నాయి. అదే విధంగా ఇతర జిల్లాల్లో కూడా విద్యా సంస్థలు మూతపడనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…