తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ వాయిదా..!
రెండు రోజు జరగాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, సలహాదారుల సమావేశం వాయిదా పడింది. మొదటి రోజు సమావేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు సాగునీటి రంగం పై సుదీర్గంగా చర్చించారు. నీటి పారుదలతో పాటు విద్యుత్, పౌరసరఫరాలు, ఏపీ భవన్, ఉద్యోగుల విభజన వంటి అంశాలపై పూర్తిస్థాయి సమావేశం జరిగింది. వీటిపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టతకు వచ్చారు. ఇక ఆయా అంశాల వారిగా విడివిడిగా తదుపరి కసరత్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక చర్చల సారాంశాన్ని సీఎంల […]

రెండు రోజు జరగాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, సలహాదారుల సమావేశం వాయిదా పడింది. మొదటి రోజు సమావేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు సాగునీటి రంగం పై సుదీర్గంగా చర్చించారు. నీటి పారుదలతో పాటు విద్యుత్, పౌరసరఫరాలు, ఏపీ భవన్, ఉద్యోగుల విభజన వంటి అంశాలపై పూర్తిస్థాయి సమావేశం జరిగింది. వీటిపై ఇరు రాష్ట్రాల అధికారులు స్పష్టతకు వచ్చారు. ఇక ఆయా అంశాల వారిగా విడివిడిగా తదుపరి కసరత్తు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇక చర్చల సారాంశాన్ని సీఎంల దృష్టికి తీసుకెళ్లనున్నారు అధికారులు. సీఎంల నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కసరత్తు చేయనున్నారు. అధికారుల చర్చల సారాంశాన్ని వివరించాక అవసరమైతే సీఎంలు మరోసారి భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. పది రోజుల తరువాత తిరుపతి వేదికగా ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యే అవకాశం ఉంది. కాగా, వచ్చే నెల రెండో వారంలో ఏపీలో మరోసారి సీఎంలు, మంత్రులు అధికారుల సమావేశం జరగనుంది.