నేల విడిచి సాము చేసిన ఫలితమే ఇది – గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఓటమిపై టీడీపీ నేతలందురూ ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ఓటమితో కార్యకర్తలు, నేతలు ఎవరూ అధైర్యపడవద్దని.. మరింత బాధ్యతతో ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే చంద్రబాబు పథకాలను, అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్న ఆయన టీడీపీ నేతలు […]

నేల విడిచి సాము చేసిన ఫలితమే ఇది - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Follow us

|

Updated on: May 29, 2019 | 6:38 PM

ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఓటమిపై టీడీపీ నేతలందురూ ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ఓటమితో కార్యకర్తలు, నేతలు ఎవరూ అధైర్యపడవద్దని.. మరింత బాధ్యతతో ప్రజలకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు డొక్కా మాణిక్య వరప్రసాద్ అయితే చంద్రబాబు పథకాలను, అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లలేకపోయామని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనన్న ఆయన టీడీపీ నేతలు నిరాశ చెందవద్దని చెప్పారు. ఇక తాజాగా ఎన్నికల్లో ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకే పరిమితం కావడంపై టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసి కూడా ఎందుకు ఇలా ఓడిపోయాం అనేది విశ్లేషించుకోవాలని ఆయన అన్నారు. ఏపీ ఎన్నికల్లో తమను టెక్నాలజీ కొంప ముంచిందా..? లేక నేల విడిచి సాము చేశామా.? అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎల్పీ నేతగా ఉంటేనే బాగుంటుందని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు.