India Vs Australia 2020: గెలవాలంటే… భారత్‌కు 309 పరుగులు.. ఆసీస్‌కు 8 వికెట్లు… విజయం ఎవరిని వరించునో

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా ముందు ఆసీస్ 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది....

India Vs Australia 2020: గెలవాలంటే... భారత్‌కు 309 పరుగులు.. ఆసీస్‌కు 8 వికెట్లు... విజయం ఎవరిని వరించునో
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 10, 2021 | 1:57 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. టీమిండియా ముందు ఆసీస్ 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఇంకా ఒకరోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. చివరిరోజు ఆటలో భారత్‌ విజయం సాధించాలంటే ఇంకా 309 పరుగులు సాధించాలి. అయితే ఆసీస్‌కు విజయం దక్కాలంటే ఎనిమిది వికెట్లు కావాలి. చూడాలి మరి భారత్‌ లక్ష్యాన్ని ఛేదిస్తుందా.. లేక మ్యాచ్‌ను సమర్పించుకుంటుందా అనేది ఆసక్తికరం.

అయితే టీమిండియా ఆటగాళ్లు గిల్‌, రోహిత్‌ శర్మలు భారత్‌కు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 71 పరుగులు సాధించిన తర్వాత గిల్‌(31; 64 బంతుల్లో 4 ఫోర్లు) ఔటయ్యాడు. అనంతరం రోహిత్ శర్మ(52) పరుగులు చేసి వెనుదిరిగాడు. అంతకముందు ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 312/6 వద్ద డిక్లేర్‌ చేసింది. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో లబూషేన్‌(73), స్టీవ్‌ స్మిత్‌(81), కామెరూన్‌ గ్రీన్‌(84)లు రాణించడంతో పాటు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌(39 నాటౌట్‌) ఆకట్టుకోవడంతో ఆసీస్‌ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Also Read: Rohit Sharma: హాఫ్ సెంచరీ చేసి ఔటైన రోహిత్ శర్మ… 33 ఓవర్లకు స్కోర్ 98/2.. క్రీజులో రహానే, పుజారా…