CSK Head Coach Salary: సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్.. జీతం ఎంతో తెలుసా..?
CSK Head Coach Salary: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తరువాత చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కోచ్ కోసం వెతుకులాట మొదలైంది. చివరకు భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) ఎంపికయ్యాడు. తొలుత అతడు సీఎస్‌కే మొదటి ఎంపిక కాదని సమాచారం. జీతంగా రూ.5-7 కోట్ల పరిధిలో బడ్జెట్ కేటాయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

CSK Head Coach Salary: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కొత్త సీజన్ కోసం కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ (Zaheer Khan)ను ప్రధాన కోచ్‌గా నియమించింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు క్రికెట్ డైరెక్టర్, మెంటార్ వంటి బాధ్యతలు నిర్వహించిన జహీర్‌కు ఇది హెడ్ కోచ్‌గా తొలి అవకాశం. 2026 సీజన్ ముగిసిన తరువాత సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. 2009 నుంచి జట్టుకు కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఫ్రాంచైజీ పలువురు అభ్యర్థులతో చర్చలు జరిపింది. చివరకు జహీర్ పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది. ప్రస్తుతానికి 2027 సీజన్ వరకే అతడి నియామకం ఖరారైంది. ఒప్పందాన్ని తరువాత పొడిగించే అవకాశం కూడా ఉంది.
జహీర్ నియామకానికి ముందు సీఎస్‌కే పలువురు కోచ్‌లతో సంప్రదింపులు జరిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానీ (Hemang Badani)తోనూ చర్చలు జరిగాయి. కానీ కేవలం ఒక ఐపీఎల్ సీజన్‌కు మాత్రమే ఒప్పందం చేసుకునే ప్రతిపాదనపై ఆయన అంగీకరించలేదని సమాచారం.
బదానీకి ఒక ఏడాదికి మించి అవకాశం కావడంతో పాటు విదేశీ లీగ్‌లలో సీఎస్‌కేకు చెందిన జట్ల కోచింగ్ బాధ్యతలు కూడా చేపట్టాలనే ఆసక్తి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ కారణంగా చర్చలు ముందుకు సాగలేదు.
బదానీతో పాటు మరో భారతీయ కోచ్, ఒక విదేశీ కోచ్‌తోనూ ఫ్రాంచైజీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆ చర్చలు ఫలించని సమయంలో జహీర్ పేరును ఎంఎస్ ధోనీ (MS Dhoni) సూచించినట్లు నివేదిక తెలిపింది. అనంతరం అతడి నియామకంపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
జహీర్‌కు సీఎస్‌కే ఎంత జీతం చెల్లించనుందనే విషయంలో స్పష్టమైన మొత్తం బయటకు రాలేదు. అయితే నివేదిక ప్రకారం ఫ్రాంచైజీ హెడ్ కోచ్ కోసం రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు బడ్జెట్ పెట్టుకుంది. ఈ పరిధిలోనే జహీర్‌కు పారితోషికం ఉండే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుత ఒప్పందాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉంది. అలా జరిగితే జహీర్ పారితోషికంలో కూడా మార్పు ఉండొచ్చని నివేదిక పేర్కొంది. సీఎస్‌కే కొత్త కోచ్‌గా అతడి తొలి సీజన్ 2027లో ఉండనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
