కరక్కాయ, టీలలో కరోనాను నిరోధించే సామర్థ్యం..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరక్కాయ, టీ నుంచి తీసిన పదార్థాలకు (గుజ్జు) కరోనా సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడే గుణం

కరక్కాయ, టీలలో కరోనాను నిరోధించే సామర్థ్యం..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 5:14 AM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరక్కాయ, టీ నుంచి తీసిన పదార్థాలకు (గుజ్జు) కరోనా సంక్రమణకు వ్యతిరేకంగా పోరాడే గుణం ఉందని ఐఐటీ-ఢిల్లీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. వీటిల్లో ఉండే గాల్లోటానిన్‌ అనే ప్రత్యేక పదార్థానికి కరోనాను నిరోధించే సామర్థ్యం ఉందని ఈ అధ్యయనం తెలిపింది.

ఐఐటీ-ఢిల్లీకి చెందిన పరిశోధకుల బృందం ప్రొఫెసర్‌ అశోక్‌ కుమార్‌ నేతృత్వంలో 51 ఔషధ మొక్కలను పరిశీలించింది. వైరస్‌ వ్యాప్తికి కీలకమైన పాలీప్రొటీన్‌ను నిర్వీర్యం చేసే సామర్థ్యమున్న మొక్కలను గుర్తించడమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగించారు. ఇందులో వైరస్‌ ప్రతిరూపాన్ని నిరోధించడంలో టీ, కరక్కాయల్లోని గాల్లోటానిన్‌ పదార్థం ప్రభావవంతంగా పని చేసింది.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..