అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్..జగన్‌పైనే ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

ఏపీ రాజకియాల్లో టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. గత కొంతకాలంగా తమ పార్టీ నుంచి జంప్‌ కొట్టే నేతలపై ఆయన విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత హోదాలో.. ప్రెస్ మీట్స్‌ పెట్టి ప్రభుత్వాన్ని కడిగిపారేయడంతో పాటు పార్టీ వాయిస్‌ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాగా వర్ల రామయ్య ఈ సారి సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు.  ఏపీ ప్రభుత్వం అవినీతిని కట్టడి చేసేందుకు ఇటీవల ఓ టోల్ ఫ్రీ […]

అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్..జగన్‌పైనే ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Nov 26, 2019 | 3:43 PM

ఏపీ రాజకియాల్లో టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు. గత కొంతకాలంగా తమ పార్టీ నుంచి జంప్‌ కొట్టే నేతలపై ఆయన విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత హోదాలో.. ప్రెస్ మీట్స్‌ పెట్టి ప్రభుత్వాన్ని కడిగిపారేయడంతో పాటు పార్టీ వాయిస్‌ను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాగా వర్ల రామయ్య ఈ సారి సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు.  ఏపీ ప్రభుత్వం అవినీతిని కట్టడి చేసేందుకు ఇటీవల ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ నెంబర్‌కు ఫోన్ చేసిన వర్ల రామయ్య..సీఎం జగన్ అవినీతిపై విచారణ చెయ్యమని కోరారు. దీనిపై ఇప్పటికే తమ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు గతంలోనే లేఖ రాశారని పేర్కొన్నారు.

వర్ల రామయ్య కాల్‌పై స్పందించిన కాల్ సెంటర్ సిబ్బంది..సచివాలయానికి వెళ్లి సంబంధిత అధికారులకు ఫిర్యాదును అందించాలని కోరారు. సీఎం జగన్ ముందుగా చెప్పినట్లుగా 15 రోజుల్లోనే తన ఫిర్యాదుపై చర్యలు ఉంటాయని వర్ల ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుపై ప్రభుత్వం గనుక స్పందిస్తే..ఇక వైసీపీ నాయకులపై వచ్చే కంప్లైంట్స్ విషయంలో పక్క రాష్ట్రంలోని జైళ్లు కూడా సరిపోవంటూ ఎద్దేవా చేశారు. సీఎంపైనే బోలెడన్నీ అవినీతి ఆరోపణలున్న నేపథ్యంలో..కరప్షన్‌ను కడిగిపారేస్తానంటూ కామెంట్స్ చేయడం అర్థరహితమన్నారు.