నాదెండ్లతో రాధా చర్చలు.. ఏంటి సంగతి.?

కాంగ్రెస్ – ప్రజారాజ్యం – వైఎస్సార్ కాంగ్రెస్ – తెలుగుదేశం.. ఇలా ఏపీలోని ప్రధాన పార్టీలన్నింటికీ ప్రాతినిధ్యం వహించిన వంగవీటి రాధాకృష్ణ.. తాజాగా జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న దిండి రిసార్ట్స్‌లో ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో రాధా చర్చలు జరిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి కోలుకున్న […]

నాదెండ్లతో రాధా చర్చలు.. ఏంటి సంగతి.?
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 05, 2019 | 11:55 PM

కాంగ్రెస్ – ప్రజారాజ్యం – వైఎస్సార్ కాంగ్రెస్ – తెలుగుదేశం.. ఇలా ఏపీలోని ప్రధాన పార్టీలన్నింటికీ ప్రాతినిధ్యం వహించిన వంగవీటి రాధాకృష్ణ.. తాజాగా జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న దిండి రిసార్ట్స్‌లో ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో రాధా చర్చలు జరిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి కోలుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇదే పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా ఆ పార్టీ పట్ల ఆకర్షితుడైనట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో టీడీపీ నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌లో కూడా రాధా హాజరుకాకపోవడంతో ఆ పార్టీ నుంచి రాధా బయటకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడంతో ఈ ప్రచారం నిజమేనని అనిపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైసీపీకు గుడ్ బై చెప్పిన రాధా.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా మారి ప్రచారం నిర్వహించిన రాధా.. టీడీపీ అధికారంలోకి వస్తే కీలక పదవి దక్కుతుందని భావించారు. అయితే ఎన్నికల్లో తర్వాత సీన్ రివర్స్ అయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ కోలుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది.