పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించం: నితిన్ గడ్కరీ

పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో చాలా కార్ల సంస్థలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితి తలెత్తింది. వెహికల్ స్క్రాపేజ్ విధానం కూడా తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని గడ్కరీ చెప్పారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కూడా ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు గడ్కరీ తెలిపారు. కన్జ్యూమర్ […]

పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధించం: నితిన్ గడ్కరీ
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2019 | 8:51 PM

పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్ పరిశ్రమ అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో చాలా కార్ల సంస్థలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితి తలెత్తింది.

వెహికల్ స్క్రాపేజ్ విధానం కూడా తీసుకువచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని గడ్కరీ చెప్పారు. హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కూడా ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు గడ్కరీ తెలిపారు. కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోవడంతో కార్ల అమ్మకాలు కూడా దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆటోమొబైల్ ఇండస్ట్రీని బతికించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా సమాచారం. ఇప్పటికే సేల్స్ పడిపోవడంతో తమ పరికరాల ఉత్పత్తిని కూడా ఆయా సంస్థలు తగ్గించేశాయి.

ట్రాఫిక్ రూల్స్ పై కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ స్పందించారు. అధిక స్థాయిలో జ‌రిమానాలు విధించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశం కాదు అని మంత్రి తెలిపారు. వాహ‌న‌దారులెవ‌రూ జ‌రిమానా క‌ట్టే ప‌రిస్థితి రాకూడ‌ద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశం అని గ‌డ్క‌రీ స్పష్టంచేశారు.