ముగిసిన అచ్చెన్నాయుడు తొలిరోజు విచారణ

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డ కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి తొలి రోజు విచారణ ముగిసింది. గుంటూరు జనరల్ హాస్పిటల్స్ కి చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణ చేపట్టారు.

ముగిసిన అచ్చెన్నాయుడు తొలిరోజు విచారణ
Follow us

|

Updated on: Jun 25, 2020 | 8:52 PM

ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డ కేసులో అరెస్టయిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి తొలి రోజు విచారణ ముగిసింది. గుంటూరు జనరల్ హాస్పిటల్స్ కి చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణ చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో మూడు గంటలకుపైగా అచ్చెన్నాయుడిని విచారించారు. మందులు కొనుగోలు చేసేందుకు ఫైల్ పై సంతకం చేశారా లేదా అనే విషయాల పై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. మరో రెండు రోజులపాటు అచ్చెన్నాయుడిని అధికారులు విచారించనున్నారు. 14 రోజుల కస్టడీలో ఉన్న అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు విచారించడానికి కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. రేపు ఉదయం పది గంటల నుండి మరోసారి విచారణ ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. ఆరోగ్యం సరిగాలేని వ్యక్తిని కరుణ లేకుండా ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయవాది హరిబాబు. కొండను తవ్వి ఎలుకను బయటకు తీసిన విధంగా విచారణ సాగిందన్నారు.