అర్ధనగ్నంగా.. పిల్లలతో శరీరంపై పెయింటింగ్.. సామాజిక కార్యకర్తపై కేసు

సామాజిక కార్యకర్తనంటూ చెప్పుకునే కేరళకు చెందిన రెహనా ఫాతిమా మరో వివాదంలో చిక్కుకుంది. అర్ధనగ్నంగా తన పిల్లలతో శరీరంపై పెయింటింగ్ వేయించుకుంది. అంతేకాదు దానికి సంబంధించిన వీడియోను బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ  వీడియోను చూసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ అరుణ్ ప్రకాశ్.. రెహానాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరువళ్ల పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్, జువైనల్ జస్టిస్ […]

అర్ధనగ్నంగా.. పిల్లలతో శరీరంపై పెయింటింగ్.. సామాజిక కార్యకర్తపై కేసు
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 10:02 PM

సామాజిక కార్యకర్తనంటూ చెప్పుకునే కేరళకు చెందిన రెహనా ఫాతిమా మరో వివాదంలో చిక్కుకుంది. అర్ధనగ్నంగా తన పిల్లలతో శరీరంపై పెయింటింగ్ వేయించుకుంది. అంతేకాదు దానికి సంబంధించిన వీడియోను బాడీ ఆర్ట్స్ అండ్ పాలిటిక్స్ పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ  వీడియోను చూసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ అరుణ్ ప్రకాశ్.. రెహానాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరువళ్ల పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్, జువైనల్ జస్టిస్ యాక్ట్‌ల కింద రెహనాపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఫాతిమాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసినట్లు తిరువళ్ల డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ రాజప్పన్ అన్నారు.

మరోవైపు ఆమె వీడియోపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. చిన్నపిల్లలతో ఆ పాడు పనులు ఏంటని మండిపడుతున్నారు. అయితే దీనిని కళాత్మక దృష్టిలో చూడాలని రెహనా చెప్పుకురావడం విశేషం. కాగా శబరిమల ఆలయ ప్రవేశం కోసం ప్రయత్నించిన రెహనా అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయ్యప్ప మాలను ధరించి స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి పలుమార్లు విశ్వప్రయత్నాలు చేశారు.  ఈ క్రమంలో అరెస్ట్ కూడా అయ్యారు. ఇక కుటుంబ సభ్యులు కూడా ఆమెను వెలి వేశారు.

Read This Story Also: పవన్‌ అలా కాదు.. జగన్‌ గురించి చెప్తూ రాపాక భావోద్వేగం

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..