టాటా గ్రూప్ నుంచి ఎలా విడిపోతున్నామంటే…!

టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ బంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను  సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి...

టాటా గ్రూప్ నుంచి ఎలా విడిపోతున్నామంటే...!
Follow us

|

Updated on: Oct 30, 2020 | 4:39 PM

Tata Group Separation Shapoorji Pallonji : రెండు వ్యాపార దిగ్గజాలు విడిపోనున్నాయి… సుదీర్ఘ సంబంధాలు తెగిపోనున్నాయి…ఈ రెండు వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి టాటా గ్రూప్ కాగా… మరొకటి షాపూర్‌జీ పలోంజీ(SP). భారతీయ వ్యాపార సామ్రాజ్యాన్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన వీరిద్దరు విడిపోనున్నారు. వీరు ఎలా విడిపోనున్నారో దేశ అత్యున్నత న్యాయస్థానంకు వివరించారు. ఆ వివరాలను ఓ ప్రకటనలో తెలిపింది ఎస్పీ గ్రూప్.

టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ బంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను  సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

గ్రూప్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని బోర్డ్‌ తొలగించిన 2016 అక్టోబర్‌ 28 తర్వాత మిస్త్రీలు-టాటాల మధ్య న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. టాటా సన్స్‌ అనేది రెండు గ్రూపులు కలిసిన కంపెనీ. టాటా గ్రూప్‌లో టాటా ట్రస్టులు, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలు ఉన్నాయి. వీరికి 81.6 శాతం వాటా ఉంది. ఇక 18.37 శాతం వాటా మిస్త్రీల కుటుంబానికి ఉందని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపినట్లుగా షాపూర్‌జీ పలోంజీ గ్రూప్‌ తమ ప్రకటనలో పేర్కొంది.