సుధీర్ బాబు-పలాస దర్శకుడి ‘శ్రీదేవి సోడా సెంటర్’ మోషన్ పోస్టర్ రిలీజ్
సుధీర్ బాబు, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతోన్న కొత్త సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి విజయం సాధించిన ఇటీవలి సినిమా ‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, నిన్న ఈ మూవీ ప్రీ లుక్‌లో డెకరేషన్ లైట్స్, సోడా బాటిల్స్, మల్లె పూలు కనిపిస్తుండగా, వీటి ఆధారం చేసుకుని సినిమా టైటిల్ ఏంటో […]

సుధీర్ బాబు, నివేదా థామస్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కబోతోన్న కొత్త సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి విజయం సాధించిన ఇటీవలి సినిమా ‘పలాస 1978’ దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా, నిన్న ఈ మూవీ ప్రీ లుక్‌లో డెకరేషన్ లైట్స్, సోడా బాటిల్స్, మల్లె పూలు కనిపిస్తుండగా, వీటి ఆధారం చేసుకుని సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయమని ప్రేక్షకులకు క్విజ్ పెట్టారు మేకర్స్. ఇక ఈరోజూ టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. తిరునాళ్లలో లైటింగ్ వేసే ఎలక్ట్రీషియన్ గా సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. చేతిలో శ్రీదేవి సోడా సెంటర్లోని సోడాని ఆప్యాయంగా మొహానికి అద్దుకోవడం మోషన్ పోస్టర్లో చూపించారు.
రేపు సాయంత్రం . కొత్త సుధీర్ బాబు … కాదు కాదు … మా సూరిబాబుని పరిచయం చేస్తాను . రేపు 4 గంటలకు ఇక్కడే కలుద్దాం మరీ ? #SSC @Karunafilmmaker @VijayChilla @devireddyshashi #Manisharma @Shamdat2 @SabbaniRamakri1 @sreekar_prasad @70mmEntertains pic.twitter.com/R9x3DCgYLz
— Sudheer Babu (@isudheerbabu) October 29, 2020