ఎయిర్‌టెల్‌, ఐడియా బాటలో జియో..కస్టమర్స్‌కు షాక్‌

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల మధ్య టారిఫ్‌ల వార్ నడుస్తోంది. ఒకదానిని మించి మరొకటి కస్టమర్లపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చార్జీల పెంపుకు సిద్ధమయ్యాయి ఈ టెలికాం సంస్థలు. నవంబర్‌ 30న ఎయిర్‌టెల్‌, ఐడియా వొడాఫోన్‌ కొత్త ప్లాన్‌ ప్రకటించగా..తాజాగా ఆల్‌ ఇన్‌ వన్‌ అనే న్యూ ప్లాన్‌ను తీసుకొచ్చింది జియో. డిసెంబర్‌ 6 నుంచి ఈ ప్లాన్‌ అమలులోకి రానుంది.  ఇది ఇతర టెలికాం సంస్థల […]

ఎయిర్‌టెల్‌, ఐడియా బాటలో జియో..కస్టమర్స్‌కు షాక్‌
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 4:57 PM

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల మధ్య టారిఫ్‌ల వార్ నడుస్తోంది. ఒకదానిని మించి మరొకటి కస్టమర్లపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చార్జీల పెంపుకు సిద్ధమయ్యాయి ఈ టెలికాం సంస్థలు. నవంబర్‌ 30న ఎయిర్‌టెల్‌, ఐడియా వొడాఫోన్‌ కొత్త ప్లాన్‌ ప్రకటించగా..తాజాగా ఆల్‌ ఇన్‌ వన్‌ అనే న్యూ ప్లాన్‌ను తీసుకొచ్చింది జియో. డిసెంబర్‌ 6 నుంచి ఈ ప్లాన్‌ అమలులోకి రానుంది.  ఇది ఇతర టెలికాం సంస్థల కంటే 25 శాతం తక్కువనే అంటోంది జియో. రిలయన్స్‌ 39 శాతం, ఎయిర్‌టెల్‌, ఐడియా 50 శాతం మేర ఛార్జీలు పెంచేశాయి.

జియోలో 28 రోజుల వ్యాలిడిటీతో  న్యూ ప్లాన్‌ 129 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. 365 రోజులకు 1199 రూపాయలు చెల్లించాలి. ఇక రోజుకు 1.5 జీబీ డేటా, 2 జీబీ డేటా, 3 జీబీ డేటా అందించే 28 రోజుల ప్లాన్స్‌ ఉన్నాయి. వీటి ధర 199, 249, 349 రూపాయలుగా ప్రకటించారు.  రిలయెన్స్ జియో రూ.329 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. నెలకు 6 జీబీ డేటా పొందొచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉచితం. ఆఫ్ నెట్ కాల్స్ 3,000 నిమిషాలు లభిస్తాయి.ఇక 1.5 జీబీ డేటాకు 56 రోజుల వ్యాలిడిటీ ప్యాక్స్‌ కూడా ఉన్నాయి. రోజుకు 2 జీబీ డేటా అందించే ప్యాక్‌ ధర 399,444 రూపాయలుగా ఉంది.84 రోజులకైతే 1.5 జీబీ 555 రూపాయలు. రోజుకు 2 జీబీ డేటా అయితే 599 రూపాయలు అవుతుంది. ఇక 2,199 రూపాయలైతే రోజుకు 1.5 జీబీ డేటా 369 రోజులకు వర్తిస్తుంది.

ఇక మరొక టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ కూడా రోజుకు 1.5GB డాటా ని  రూ.248 ప్లాన్ తో అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో.. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకునే సదుపాయం కలిగిస్తోంది. రోజుకు 100 SMS లు ఉచితం.రూ .249 ప్రీపెయిడ్ ప్లాన్ తో వోడాఫోన్ కూడా రోజుకు 1.5GB డేటాని అందిస్తుంది. వోడాఫోన్ టు వోడాఫోన్ అన్ లిమిటెడ్ కాల్స్, మరియు  ఇతర నెట్ వర్క్ లకు 1000 మినిట్స్  వాయిస్ కాల్స్ ను అందిస్తుంది. వీటితో పాటుగా రోజుకు 100 SMS లు ఉచితం.