భక్తులకు కుచ్చుటోపీ పెట్టిన తమిళనాడు ‘సర్వమంగళపీఠం’ శాంతా స్వామిజీ
తమిళనాడులోని రాణిపేట జిల్లాలో భక్తులకు కోట్లలో ఆదాయమంటూ చెప్పి.. సర్వమంగళం పాడాడు శాంతా స్వామీజీ, అలియాస్ (శాంతకుమార్). వెల్లూర్ జిల్లాకి చెందిన 45 ఏళ్ల శాంతా స్వామిజీ తిరువళంలో సర్వమంగళం పీఠం పేరుతో ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఆధ్యాత్మిక పూజల పేరుతో వెల్లూర్, రాణిపేట, తిరుపత్తూర్ జిల్లాలలో బాగా పేరు సంపాదించాడు శాంతా స్వామిజీ. ఈ క్రమంలో తన దగ్గరకి వచ్చిన భక్తులను కోటీశ్వరులను చేస్తానంటూ నమ్మబలికి లక్షలలో డబ్బులు దండుకొని, తిరిగి అడిగితే మీకు నష్టం వచ్చేలా […]
తమిళనాడులోని రాణిపేట జిల్లాలో భక్తులకు కోట్లలో ఆదాయమంటూ చెప్పి.. సర్వమంగళం పాడాడు శాంతా స్వామీజీ, అలియాస్ (శాంతకుమార్). వెల్లూర్ జిల్లాకి చెందిన 45 ఏళ్ల శాంతా స్వామిజీ తిరువళంలో సర్వమంగళం పీఠం పేరుతో ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఆధ్యాత్మిక పూజల పేరుతో వెల్లూర్, రాణిపేట, తిరుపత్తూర్ జిల్లాలలో బాగా పేరు సంపాదించాడు శాంతా స్వామిజీ. ఈ క్రమంలో తన దగ్గరకి వచ్చిన భక్తులను కోటీశ్వరులను చేస్తానంటూ నమ్మబలికి లక్షలలో డబ్బులు దండుకొని, తిరిగి అడిగితే మీకు నష్టం వచ్చేలా శూన్యం పెడతానంటూ బెదిరింపులుకు దిగాడు. రాణిపేటకి చెందిన చాలా మంది దగ్గర 10 లక్షలు ఇస్తే 3 నెలలలో 5 కోట్లు వస్తాయని డబ్బులు లాగేశాడు. బెంగళూరులో ఉండే తన భక్తుడు కమలాకర్ రెడ్డి చేసే వ్యాపారంలో పెట్టుబడులు అంటూ మరికొందరి దగ్గర 20 నుండి 40 లక్షలు చొప్పున తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా స్వామిజీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో భక్తులు ప్రశ్నిస్తే.. మీ కుటుంబం నాశనం అవ్వాలని శూన్యం పెడతానంటూ బెదిరించడంతో కొందరు భక్తులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో స్వామివారి వ్యవహారం బయటకొచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని స్వామీజీని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.