ట్రంప్‌ ఓడినట్టుగానే బీహార్‌లో నితీశ్‌ ఓడిపోతారు ః శివసేన

బీజేపీపై సందుదొరికితే చాలు విమర్శిస్తున్న శివసేన అమెరికా ఎన్నికల ఫలితాలను కూడా బీజేపీకి ముడిపెడుతూ ఘాటుగానే విమర్శించింది..

  • Balu
  • Publish Date - 12:14 pm, Mon, 9 November 20
ట్రంప్‌ ఓడినట్టుగానే బీహార్‌లో నితీశ్‌ ఓడిపోతారు ః శివసేన

బీజేపీపై సందుదొరికితే చాలు విమర్శిస్తున్న శివసేన అమెరికా ఎన్నికల ఫలితాలను కూడా బీజేపీకి ముడిపెడుతూ ఘాటుగానే విమర్శించింది.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో కూడా అమెరికా తరహా ఫలితమే వస్తుందని చెప్పింది. ట్రంప్‌ ఓడిపోయినట్టుగానే ఇక్కడ జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌కుమార్‌ కూడా పరాజయంపాలు కావడం తప్పదని పేర్కొంది. ట్రంప్‌ ఓటమి నుంచి భారత్‌ పాఠాలునేర్చుకోవాలని హితవు చెప్పింది.. తేజస్వీయాదవ్‌ వంటి యువనేత ఎదుట నరేంద్రమోదీ, నితీశ్‌కుమార్‌లాంటి వారు నిలువలేరంటూ విమర్శించింది. ఎన్డీయే నాయకులను ఉద్దేశిస్తూ … తాము తప్ప ప్రజలకు మరో ఆల్టర్‌నేట్‌ లేదనే భ్రమల్లో ఉన్న నేతలను గద్దె దించడానికి ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారని శివసేన తెలిపింది.