5

జో బైడెన్ కూ ఇండియాలో బంధువులున్నారట !

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ కి కూడా ఇండియాలో..ముంబైలో  బంధువులున్నారట.. కొన్ని దశాబ్దాల క్రితం తాను సెనెటర్ కాగానే ముంబై నుంచి తనకు ఎవరో బైడెన్ పేరిట లేఖ రాశారని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీలో పని చేసిన గ్రేట్..గ్రేట్..గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నట్టు తనకు అప్పుడే తెలిసిందన్నారు. ముంబైలో 5 గురు బైడెన్ లు ఉన్నారని ఆయన చెప్పారు. గతంలో నేను అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇండియా ట్రిప్ లో ఉన్న […]

జో బైడెన్ కూ ఇండియాలో బంధువులున్నారట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 09, 2020 | 12:15 PM

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ కి కూడా ఇండియాలో..ముంబైలో  బంధువులున్నారట.. కొన్ని దశాబ్దాల క్రితం తాను సెనెటర్ కాగానే ముంబై నుంచి తనకు ఎవరో బైడెన్ పేరిట లేఖ రాశారని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీలో పని చేసిన గ్రేట్..గ్రేట్..గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నట్టు తనకు అప్పుడే తెలిసిందన్నారు. ముంబైలో 5 గురు బైడెన్ లు ఉన్నారని ఆయన చెప్పారు. గతంలో నేను అమెరికా ఉపాధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇండియా ట్రిప్ లో ఉన్న సందర్భంలో ఈ బైడెన్ గురించి తెలుసుకున్నా,, కానీ ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేయలేకపోయా అని బైడెన్ చెప్పారు. 1972 లో 29 ఏళ్ళ యువకునిగా ఉన్నప్పుడు ఆ లేఖ అందిందని ఆయన తెలిపారు. మొత్తానికి ఆ వ్యక్తి పేరును జార్జ్ బైడెన్ అని తెలుసుకున్నానని, ఈస్టిండియా ట్రేడింగ్ కంపెనీలో ఆయన  కెప్టెన్ గా పని చేసినట్టు వెల్లడైందని బైడెన్ పేర్కొన్నారు. కమలా హారిస్ మాదిరే తనకూ ఇండియాలో రిలేటివ్స్ ఉన్నారని ఆయన చెప్పకనే చెప్పారు.