కమెడియన్ పుట్టినరోజు నాడే కుమారుడు మృతి.. భావోద్వేగ పోస్ట్
ప్రముఖ కమెడియన్ రాజీవ్ నిగమ్ కుమారుడు దేవరాజ్ కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవరాజ్

Rajeev Nigam’s Son: ప్రముఖ కమెడియన్ రాజీవ్ నిగమ్ కుమారుడు దేవరాజ్ కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవరాజ్.. రాజీవ్ పుట్టినరోజు నాడే(నవంబర్ 8)తుది శ్వాస విడిచారు. దీంతో రాజీవ్ నిగమ్ ఇంట విషాదం నెలకొంది. (గంజాయ్ స్మగ్లర్ చేతిలో దారుణ హత్యకు గురైన టీవీ రిపోర్టర్)
ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలోవెల్లడించిన రాజీవ్.. ”ఎంతటి సర్‌ప్రైజ్ బర్త్‌డే గిఫ్ట్. నేను కేక్‌ని కట్ చేయకుండానే.. నా కుమారుడు తన శరీరాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఎవ్వరికీ ఇలాంటి బహుమతులు లభిస్తాయి” అంటూ బాధాతప్తమైన హృదయంతో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో తన కుమారుడితో తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఈ ఆగష్టులో రాజీవ్ తండ్రి మరణించగా.. ఇప్పుడు కుమారుడు చనిపోయారు. ( చాలా గర్వంగా ఉంది.. ఆయన ఙ్ఞాపకాలతో బ్రతికేస్తా: అమర జవాన్ ప్రవీణ్ రెడ్డి భార్య)
కాగా ఓ జర్నలిస్ట్ వివరాల ప్రకారం.. ”రెండేళ్ల క్రితం దేవరాజ్ అనారోగ్యం బారిన పడ్డారు. ఆ తరువాత కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో కుమారుడి కోసం రాజీవ్ కెరీర్‌ని పణంగా పెట్టారు. తన కుమారుడిని చూసుకునేందుకు స్వగ్రామానికి వెళ్లిపోయారు” అని వివరించారు. ( Flash: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్)