బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిలో ఎన్సీబీ సోదాలు

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిలో ఎన్సీబీ సోదాలు

ముంబైలో..బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోమవారం సోదాలు జరిపారు.

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Nov 09, 2020 | 1:09 PM

ముంబైలో..బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంట్లో  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోమవారం సోదాలు జరిపారు. బాలీవుడ్ కి డ్రగ్స్ కి లింక్ ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలకు వారు శ్రీకారం చుట్టారు. ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా భార్యను నిన్న అరెస్టు చేసి.. ఆ ఇంటినుంచి 10 గ్రాముల మార్జువానాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తమముందు ఈ నెల 8 న హాజరు కావాల్సిందిగా కోరుతూ ఫిరోజ్ కు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి.  బాలీవుడ్ కి చెందిన మరికొందరి ఇళ్లలో తాము  సోదాలు చేయనున్నామని ఈ సంస్థ అధికారులు తెలిపారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu