సంజూ సామ్‌సన్‌ను ప్రశంసించిన బ్రియాన్‌ లారా

సంజూ సామ్‌సన్‌ను ప్రశంసించిన బ్రియాన్‌ లారా

మోడ్రన్‌ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాళ్లలో ఒకరైన బ్రియాన్‌ లారాకు సంజూ సామ్‌సన్‌ అంటే మహా ఇష్టమట! అతడే కాదు.. మరో నలుగురు యంగ్‌ ఇండియన్స్‌ను తాను అమితంగా ఇష్టపడతానని చెప్పాడు లారా!

Balu

|

Nov 09, 2020 | 1:14 PM

మోడ్రన్‌ క్రికెట్‌లో అద్భుతమైన ఆటగాళ్లలో ఒకరైన బ్రియాన్‌ లారాకు సంజూ సామ్‌సన్‌ అంటే మహా ఇష్టమట! అతడే కాదు.. మరో నలుగురు యంగ్‌ ఇండియన్స్‌ను తాను అమితంగా ఇష్టపడతానని చెప్పాడు లారా! వెస్టిండీస్‌కు చెందిన ఈ మాజీ కెప్టెన్‌ వారంటే ఎందుకిష్టమో వివరణ ఇచ్చుకున్నాడు.. బ్రియాన్‌ లారాకు ఇష్టమైన క్రికెటర్లలో సంజూ సామ్‌సన్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న సంజూ రెండు మ్యాచ్‌లలో 16 సిక్సర్లు కొట్టి భేష్‌ అనిపించుకున్నాడు.. ఎంపీ శశిథరూర్‌ కూడా సంజూ బ్యాటింగ్‌ను కొనియాడారు.. అయితే తర్వాతి మ్యాచ్‌లలో ఆ ఊపును కొనసాగించలేకపోయాడు.. అయినప్పటికీ సంజూ బ్యాటింగ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.. సంజూలో బోలెడంత టాలెంట్‌ ఉందని, చక్కటి టైమింగ్‌తో చూడముచ్చటైన షాట్లు కొడతాడని, తప్పకుండా అతడు టీమిండియాలో కీలకసభ్యుడవుతాడని బ్రియాన్‌ లారా అన్నాడు. ముంబాయి ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌పై కూడా ప్రశంసలు కురిపించాడు.. ముంబాయి టీమ్‌లో బెస్ట్‌ ప్లేయర్లు లేనప్పుడు సూర్యకుమార్‌ను నంబర్‌ త్రీలో దించితే బాగుంటుందని లారా సూచించాడు.. ఒకవేళ ఓపెనర్లు విఫలమైనా సూర్యకుమార్‌ క్రీజ్‌లో నిలదొక్కుకుని ఆడే అవకాశం ఉంటుందని అన్నాడు. ఇక రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ మెంబర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ను కూడా ఇష్టపడతానన్నాడు బ్రియాన్‌ లారా. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ టీమ్‌లో అత్యధిక పరుగులు చేసిన పడిక్కల్‌ హైలీ టాలెంటెడ్‌ అని కొనియాడాడు. తాను టీ-20, ఐపీఎల్‌లోనే ఆడితే సరిపోదని, టెస్ట్‌ మ్యాచ్‌లలో కూడా ఆడాలని లారా కొరాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సారథి కేఎల్‌ రాహుల్‌ను ఇష్టపడని వారుండరు.. లారాకు కూడా రాహుల్ అంటే ఇష్టమేనట! సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌, అండర్‌-19 మాజీ కెప్టెన్‌ ప్రియమ్‌ గార్గ్‌ కూడా లారా అభిమానించే ఆటగాడు.. ఇదే టీమ్‌లో ఉన్న జమ్ముకశ్మీర్‌ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ సమద్‌ను కూడా లారా మెచ్చుకున్నాడు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu