ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లు ఎవరికి దక్కేను..!

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ క్లయిమాక్స్‌కు వచ్చింది.. విజేత ఎవరో రేపటితో తేలిపోతుంది.. రేపు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో...

ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాప్‌లు ఎవరికి దక్కేను..!
Follow us

|

Updated on: Nov 09, 2020 | 12:31 PM

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 13వ సీజన్‌ క్లయిమాక్స్‌కు వచ్చింది.. విజేత ఎవరో రేపటితో తేలిపోతుంది.. రేపు దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబాయి ఇండియన్స్‌ తలపడుతుంది.. ముంబాయి టీమ్‌ను ఢిల్లీ నిలువరించి మొదటిసారి ఛాంపియన్‌గా అవతరించగలుగుతుందా? లేక అయిదోసారి కప్పును గెల్చుకుని ముంబాయి రికార్డు సృష్టిస్తుందా అన్న కాసింత ఉత్కంఠగానే ఉంది.. ఫామ్‌లో ఉంది కదా అని ముంబాయి గెలుస్తుందని కచ్చితంగా చెప్పడానికి లేదు.. టీ-20లలో ఏదైనా జరగవచ్చు.. ఆ విషయాన్ని పక్కన పెడితే పర్పుల్‌, ఆరెంజ్‌ క్యాప్‌లు ఎవరికి దక్కుతాయన్నదానిపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ తెగ చర్చించుకుంటున్నారు.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ఇప్పటికే 670 పరుగులు చేసి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.. అయితే 603 పరుగులతో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు ఇంకో మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది.. మూడో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ క్యాప్టన్‌ డేవిడ్‌ వార్నర్‌కు అసలు ఛాన్సే లేదు.. ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా ధావన్‌ తన బ్యాట్‌కు పనికల్పించితే ఆరెంజ్‌ క్యాప్‌ అతడికి దక్కుతుంది. ధావన్‌ ఫామ్‌ చూస్తుంటే ఆ గౌరవం అతడికే దక్కవచ్చని అనిపిస్తోంది. ఇక బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కొస్తే దక్షిణాఫ్రికా ప్లేయర్‌ కాగిసో రబడకు పర్పుల్‌ క్యాప్‌ దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ విజయాలలో ప్రధాన భూమికను పోషిస్తున్న రబడ ఇప్పటికే తన ఖాతాలో 29 వికెట్లు వేసుకున్నాడు. ముంబాయి ఇండియన్స్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 27 వికెట్లతో రెండో ప్లేస్‌ ఉన్నాడు.. రేపు జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌లో బుమ్రా ధాటిగా బౌలింగ్‌ చేస్తే పర్పుల్‌ క్యాప్‌ దక్కవచ్చు.. ముంబాయి ఇండియన్స్‌కే చెందిన మరో బౌలర్‌ ట్రెంట్‌ బౌల్డ్‌ ఇప్పటికి 22 వికెట్లు తీసుకుని థర్డ్‌ ప్లేస్‌లో ఉన్నాడు.. ఇతనికి పర్పుల్‌ క్యాచ్‌ దక్కాలంటే ఏదైనా మిరాకిల్‌ జరగాలి..