T20 world cup 2021: విలియమ్సన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.. స్పిన్నర్ అశ్విన్..

టీ20 ప్రపంచకప్ 2021 తొలి సెమీఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఓపెనింగ్ ఓవర్లలో న్యూజిలాండ్ బాగా బౌలింగ్ చేసింది...

T20 world cup 2021: విలియమ్సన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది.. స్పిన్నర్ అశ్విన్..
Ashwin
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 11, 2021 | 3:48 PM

టీ20 ప్రపంచకప్ 2021 తొలి సెమీఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఓపెనింగ్ ఓవర్లలో న్యూజిలాండ్ బాగా బౌలింగ్ చేసింది. అయితే చివరి ఓవర్లలో మొయిన్ అలీ యొక్క అద్భుతమైన ఇన్నింగ్స్ ఇంగ్లాండ్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చింది. మొయిన్ అలీ 37 బంతుల్లో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడని భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ అన్నాడు. విలియమ్సన్ నిర్ణయాన్ని అశ్విన్ తప్పుబట్టాడు.

“ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ తన అత్యంత ముఖ్యమైన స్పిన్నర్ మిచెల్ సాంట్‌నర్‌కు ఒక ఓవర్ మాత్రమే ఇచ్చాడు. ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో ఉన్నారు. కాబట్టి విలియమ్సన్ సాంట్నర్‌ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్‎కు బౌలింగ్ ఇచ్చాడు. విలియమ్సన్ నిర్ణయం ఆశ్చర్యంగా ఉంది.” అని అశ్విన్ అన్నాడు. “సాంట్నర్‌కి కేవలం ఒక ఓవర్ మాత్రమే వేసి 8 పరుగులు ఇచ్చాడు. అని చెప్పాడు.

మొదటి సెమీ-ఫైనల్‌లో మొయిన్ అలీ అజేయంగా 51 పరుగులు చేయడంతో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్ 24 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. కానీ మొయిన్, డేవిడ్ మలన్ వీరిద్దరూ కలిసి 63 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లండ్‌ ఈ స్కోర్ చేయగలిగింది. మలన్ 30 బంతుల్లో 41 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, సౌథీ ఒక్కో వికెట్ తీశారు.

Read Also.. Venkatesh Iyer: అతడిని చూసే ఎడమచేతి బ్యాటింగ్‎కు మారా.. వెంకటేష్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు..