AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నేను సైతం అంటూ మారథాన్‌లో పాల్గొన్న బాతు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

ఇటీవల కాలంలో మనుషుల మాదిరిగా జంతువులు, పక్షులు కూడా స్వేచ్ఛగా రోడ్లమీద సంచరిస్తున్నాయి..

Viral Video: నేను సైతం అంటూ మారథాన్‌లో పాల్గొన్న బాతు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Basha Shek
|

Updated on: Nov 10, 2021 | 10:16 PM

Share

ఇటీవల కాలంలో మనుషుల మాదిరిగా జంతువులు, పక్షులు కూడా స్వేచ్ఛగా రోడ్లమీద సంచరిస్తున్నాయి. అన్ని పనులు చేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌లోని లాహోర్‌ రోడ్ల మీద ఆస్ట్ర్రిచ్‌(నిప్పుకోడి) సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాతు కూడా రోడ్లపైకి వచ్చింది. బుడిబుడి అడుగులు వేస్తూ మారథాన్‌ను పూర్తి చేసింది. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాలోని న్యూయార్క్‌లో ఏటా మారథాన్‌ పోటీలు నిర్వహిస్తారు. అయితే గతేడాది కరోనా కారణంగా ఈ పోటీలు జరగలేదు. దీంతో ఈసారి పోటీల్లో పాల్గొనేందుకు చాలామంది ఆసక్తి చూపారు. వీరితో పాటు ఓ రింకిల్‌ బాతు కూడా ఈ పోటీల్లో పాల్గొంది. కాళ్లకు చిన్న ఎర్రటి షూస్‌ ధరించి తోటి పోటీదారులతో ఉత్సాహంగా పరిగెత్తింది. బాతు పరుగును చూసి రోడ్డు పక్కన నిల్చోన్న వారు కూడా ‘కమాన్‌..కమాన్‌’ అంటూ ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న యూజర్‌.. ‘ నేను మారథాన్‌లో పరిగెత్తాను. వచ్చే ఏడాది మరింత మెరుగ్గా పరిగెత్తుతాను’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో బాతు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘26.2 మైళ్ల మారథాన్‌లో బాతు పాల్గొనడం నిజంగా అద్భుతమే’, ‘సో క్యూట్‌’ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also read:

Viral Video: ‘ఉన్నదాంట్లో హ్యాపీగా బ్రతకడమే జీవితం’.. గొప్ప సందేశాన్నిస్తున్న వెడ్డింగ్ వైరల్ వీడియో

Viral Video: ‘ఫోన్ నాదంటే.. నాది’.. చిన్నారి వర్సెస్ వానరం.. క్యూట్ వీడియో భలే ఉంది

Viral Video: వావ్‌ సూపర్బ్‌.. ఆ తండ్రీ కూతురి ఫొటోకు నెటిజన్లు కామెంట్లు..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే