దమ్ముంటే నాతో చర్చకు రా.. పోసానికి, పృథ్వీ ప్రతి సవాల్

దమ్ముంటే నాతో చర్చకు రమ్మంటూ కమేడియన్ పృథ్వీ.. పోసాని కృష్ణ మురళికి ప్రతి సవాల్ విసిరారు. పృథ్వీ రెండు రోజుల క్రితం రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. నటుడు, కమెడియన్ పోసాని కృష్ణమురళి గురువారం పృథ్వీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పృథ్వీ అమరావతి రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పోసాని డిమాండ్ చేశారు.  ఇప్పుడు ఈ కామెంట్స్‌పై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలనమైన కామెంట్స్ చేశారు. అమరావతిలో ధర్నాలు […]

దమ్ముంటే నాతో చర్చకు రా.. పోసానికి, పృథ్వీ ప్రతి సవాల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 10, 2020 | 8:30 PM

దమ్ముంటే నాతో చర్చకు రమ్మంటూ కమేడియన్ పృథ్వీ.. పోసాని కృష్ణ మురళికి ప్రతి సవాల్ విసిరారు. పృథ్వీ రెండు రోజుల క్రితం రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. నటుడు, కమెడియన్ పోసాని కృష్ణమురళి గురువారం పృథ్వీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పృథ్వీ అమరావతి రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ పోసాని డిమాండ్ చేశారు.  ఇప్పుడు ఈ కామెంట్స్‌పై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ సంచలనమైన కామెంట్స్ చేశారు.

అమరావతిలో ధర్నాలు చేస్తున్నవారు ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనని.. వారిని తీసుకొచ్చే అక్కడ ధర్నాలు చేయిస్తున్నారని వ్యాఖ్యానించారు పృథ్వీ. నాతో పాటు నటించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు అక్కడ ఉన్నారన్నారు. వీళ్లంతా బినామీ రైతులే.. పేద రైతులు ఎలా అవుతారని విమర్శలు చేశారు. నేను గడ్డితిని బతకడం లేదు.. అన్నం తినే బతుకుతున్నానని, అమరావతి రైతుల నుంచి భూములు లాక్కున్నప్పుడు పోసాని కృష్ణమురళి ఎందుకు స్పందించలేదని వ్యాఖ్యానించారు పృథ్వీ.

పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. పార్టీ స్టాండ్ ప్రకారమే నేను మాట్లాడాను. నా వల్ల పార్టీ నష్టపోతోందని.. తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవడో మాట్లాడితే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నారు. నేను రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నుంచి వైసీపీకి హార్డ్ కోర్ ‌ఫ్యాన్ని దమ్ముంటే పోసాని కృష్ణమురళి ఒక వేదిక మీదికి వచ్చి మాట్లాడాలన్నారు. నేను వ్యవసాయం చేసే రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనలేదు. నేను తప్పు బట్టేది అక్కడున్న పెయిడ్ ఆర్టిస్టుల గురించే. అయినా.. నాకంటే ముందు వారిని పెయిడ్ ఆర్టిస్టులని మంత్రి బొత్సతో పాటు చాలా మంది అన్నారు. నేను మాత్రమే కనిపించానా అంటూ.. హాట్ హాట్ కాంట్స్ చేశారు కమెడియన్ పృథ్వీ.