40ఏళ్ళ అనుభవం..4వేల ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ల పర్వంలో దూకుడు పెంచారు. చంద్రబాబునాయుడుపై విపరీతమైన ఆరోపణలు, ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా గత కొన్ని రోజులుగా చంద్రబాబును, టీడీపీని తెగ విమర్శిస్తున్న విజయసాయి రెడ్డి శుక్రవారం అదే పంథాను కొనసాగించారు. అయితే ఇంకాస్త దూకుడు పెంచారు. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొన్న మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయి. గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా. […]
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ల పర్వంలో దూకుడు పెంచారు. చంద్రబాబునాయుడుపై విపరీతమైన ఆరోపణలు, ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా గత కొన్ని రోజులుగా చంద్రబాబును, టీడీపీని తెగ విమర్శిస్తున్న విజయసాయి రెడ్డి శుక్రవారం అదే పంథాను కొనసాగించారు. అయితే ఇంకాస్త దూకుడు పెంచారు.
ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు కొన్న మీ బినామీలు, అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయి. గంటలో వెయ్యి కోట్లు పోగు చేసే స్థోమత ఉన్నోళ్లు మీరంతా. మీరివ్వకుండా జనం మీద పడి జోలె చాపడం ఏమిటి చంద్రబాబూ? తుపాకులు కొని సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 10, 2020
నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంతో నాలుగు వేల ఎకరాల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో అమరావతిని దోచుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారని, అది కాస్తా ఇపుడు సాధ్యం కాని పరిస్థితి ఉత్పన్నం కావడంతో చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని విజయసాయి ట్వీట్ చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొన్న మీ బినామీలు, చంద్రబాబు అనుచర వర్గం ఆస్తులు లక్ష కోట్ల పైనే ఉంటాయని ఆయన ఆరోపించారు.
జయము జయము చంద్రన్న భజనతో మొదలై జోలె పట్టుకునే వరకు వెళ్లింది ఉద్యమం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ 4 వేల ఎకరాల ‘ఇన్ సైడర్’ భూముల కోసం పడరాని పాట్లు పడుతోంది. ఎక్కడ ఒక ప్రాణం పోతుందా అని రాబందులాగా కాచుక్కూర్చుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 10, 2020
గంటలో వెయ్యి కోట్లు పోగుచేసే స్థోమత ఉన్న చంద్రబాబు.. తాను సొంతంగా జెఏసీకి డబ్బులివ్వకుడా జోలె పట్టి అర్థించడమేంటని ఎద్దేవా చేశారు విజయసాయి. జయము జయము చంద్రన్న భజనతో మొదలైన ఆందోళన చివరికి జోలె పట్టుకునే వరకు వెళ్లిందని వ్యంగ్యోక్తి విసిరారు.