సుశాంత్ ఆత్మతో సంప్రదించాడట.. షాకిస్తున్న వీడియో..!

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మతో తాను కనెక్ట్ అయినట్లు ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్ వెల్లడించారు. అతడు ఈ పనిని 10 సంవత్సరాలుగా చేస్తుండగా..

  • Updated On - 8:44 am, Sat, 18 July 20
సుశాంత్ ఆత్మతో సంప్రదించాడట.. షాకిస్తున్న వీడియో..!


Sushant Singh Rajput’s Spirit Steve Huff: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. అటు ఫ్యాన్స్, ఇటు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు సుశాంత్ లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని కొంతమంది అంటుంటే.. లేదు హత్య చేశారని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఎంక్వయిరీలో మాత్రం సూసైడ్ అనే తేలింది.

ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానులు.. ఇంకెన్నో రహస్యాలు.. సుశాంత్ మరణం వెనుక దాగి ఉన్నాయని అభిమానులు సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మతో సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్‌కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్లు నుంచి ఈ-మెయిల్స్, మెసేజ్స్ వచ్చాయట. ఇక ఆయన జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహాయంతో సుశాంత్ ఆత్మను సంప్రదించాడట. దీనికి సంబంధించిన వీడియోను తన ఫేస్ బుక్, యూట్యూబ్ ఛానల్స్‌లో పోస్ట్ చేయగా.. అందులో స్టీవ్ పలు ప్రశ్నలను కూడా సంధించినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు అది కాస్తా వైరల్ అవుతోంది. ఇక దీనికి ఫాలో అప్ కూడా ఉంటుందని ఫ్యాన్స్‌కు స్పష్టం చేశాడు.

స్టీవ్ హుఫ్.. ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్.. గత 10 సంవత్సరాలుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. ఈ అసాధారణ పని కోసం ఎన్నో అత్యుత్తమైన పరికరాలను కూడా కనుగొన్నాడు. గతంలో పలువురు ప్రముఖుల ఆత్మలను కూడా ఆయన సంప్రదించినట్లు కొంతమంది నెటిజన్లు చెబుతుంటారు.

ఇటీవల ఆయన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మతో సంప్రదించాడు. వీడియో ప్రకారం.. ”హుఫ్ ఒక పరికరం ద్వారా ఆత్మల ప్రపంచంతో కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అతడు సుశాంత్‌ ఆత్మతో మాట్లాడాడు. పలు ప్రశ్నలను కూడా అడిగాడు. సుశాంత్ ఆత్మతో పాటు ఒక మగ ఆత్మ.. ఆ తర్వాత మహిళ శబ్దాలు వినిపిస్తాయి. ఇక ఆ మహిళ ”ఇది ముగుస్తోంది’ అని చెబుతుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం.. హుఫ్ పారానార్మల్ తన బ్లాగ్‌లో, వీడియోలో తెలిపిన వివరాలతో రాసింది మాత్రమే..