సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి అతని కుటుంబంతో మంచి సంబంధాలు లేవని, పైగా రెండో పెళ్లి చేసుకున్నందుకు సుశాంత్ తన తండ్రి కేకే ఖాన్ పై కోపంతో ఉండేవాడని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను సుశాంత్ సోదరుడు నీరజ్ బబ్లు ఖండించారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు సంజయ్ రౌత్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేదా తాము తీసుకోబోయే లీగల్ చర్యను ఎదుర్కొనేందుకు సిధ్ధంగా ఉండాలని ఆయన హెచ్ఛరించారు. మా తండ్రి రెండో పెళ్లి వార్త ఫేక్..నిరాధార ఆరోపణలు చేసినందుకు మీరు పబ్లిక్ గా అపాలజీ చెప్పాల్సిందే..లేదా మీపై కోర్టులో కేసు వేస్తాం అని ఆయన అన్నారు. సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తును మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న రౌత్.. సుశాంత్ కి తన తండ్రితో సజావైన సంబంధాలు లేవని, ఆయన తన తండ్రిని ఎన్ని సార్లుకలిశాడని ఇటీవల ప్రశ్నించారు. పైగా సుశాంత్ మరణించిన 40 రోజుల తరువాతే ఈ కుటుంబం బయటికి వచ్చిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా ఉండగా సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ ని ఈడీ మళ్ళీ సోమవారం ప్రశ్నించింది. వీరిని ఇదివరకే ఎన్నో గంటలపాటు ఇంటరాగేట్ చేసిన సంగతి విదితమే.