AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిత్య పెళ్లికొడుకు

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిత్య పెళ్లికొడుకులా చలామణి అవుతున్నాడు. విడాకుల కేసు న్యాయస్థానంలో నడుస్తుండగానే తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ నిర్వాకమిది. కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న అతడి రెండో భార్య తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రావుల మహేశ్‌ అలియాస్‌ మల్లయ్య ప్రస్తుతం సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. […]

ఈ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిత్య పెళ్లికొడుకు
Venkata Narayana
|

Updated on: Nov 07, 2020 | 12:37 PM

Share

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నిత్య పెళ్లికొడుకులా చలామణి అవుతున్నాడు. విడాకుల కేసు న్యాయస్థానంలో నడుస్తుండగానే తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ నిర్వాకమిది. కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న అతడి రెండో భార్య తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది. వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన రావుల మహేశ్‌ అలియాస్‌ మల్లయ్య ప్రస్తుతం సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతను 2014లో మోతె మండలానికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఏడాదిలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. 2016 లో చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ప్రస్తుతం ఓ కుమారుడు ఉన్నాడు. కుమారుడు కడుపులో ఉండగానే భర్త వేధింపులు తాళలేక స్రవంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. 2018 లో ఆమె చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేష్ పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఈ కేసు న్యాయస్థానంలో కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం ఓ యువతికి మహేశ్‌ మాయమాటలు చెప్పి సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పెన్‌పహాడ్‌ పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేయడంతో నాలుగు రోజుల తర్వాత యువతిని తీసుకొని కానిస్టేబుల్‌ వచ్చాడు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులు యువతిని ఇంటికి తీసుకెళ్లారు. అయినా అతనిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. తాజాగా ఈ ఏడాది అక్టోబరు 29న సూర్యాపేట మండలం పిల్లలమర్రికి చెందిన మరో యువతిని ఆమనగల్‌ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య స్రవంతి చివ్వెంల పోలీసులను ఆశ్రయించింది. రుజువులు చూపితేనే ఫిర్యాదు స్వీకరిస్తామంటూ అక్కడి పోలీసులు తెలిపారని బాధితురాలు వాపోతోంది. తనకు తన కుమారుడికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులను వేడుకుంటుంది.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా