AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీఎస్టీ కింద అరెస్టు అధికారాలను పరిశీలిస్తాం: సుప్రీం కోర్టు

వస్తుసేవల పన్ను చట్టం కింద అరెస్టు అధికారాల పరిశీలనకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పాటైన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ ఎగవేత పేరిట నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంపై వివిధ హైకోర్టులు భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేయడాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అరెస్టుపై […]

జీఎస్టీ కింద అరెస్టు అధికారాలను పరిశీలిస్తాం: సుప్రీం కోర్టు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 29, 2019 | 8:50 PM

Share

వస్తుసేవల పన్ను చట్టం కింద అరెస్టు అధికారాల పరిశీలనకు సుప్రీం కోర్టు అంగీకరించింది. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్ గొగొయ్ నేతృత్వంలో ఏర్పాటైన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంపై దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ ఎగవేత పేరిట నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడంపై వివిధ హైకోర్టులు భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేయడాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో అరెస్టుపై చట్టంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయో సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

అలాగే జీఎస్టీ చట్టం కింద అరెస్టైన వారికి ముందస్తు బెయిల్ ముంజూరు చేసేముందు ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పును తాము సమర్థించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీం కోర్టు కోరింది. జీఎస్టీ చట్టం ప్రకారం అరెస్టులు చేయవచ్చని దేశ సర్వోన్నత న్యాయం స్థానం సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో జీఎస్టీ ఎగవేసిన వారిని అరెస్టు చేయవచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.కోట్లు కొల్లగొట్టిన కేసులో అరెస్టయిన ఇన్ఫినిటీ మెటల్స్‌ ప్రొడక్ట్‌(ఐ) లిమిటెడ్‌కు చెందిన రమణారెడ్డి.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది.

Follow Us
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు
మనుషుల మధ్య కుక్క పిల్లల్లా తిరుగుతున్న బెంగాల్ టైగర్!
మనుషుల మధ్య కుక్క పిల్లల్లా తిరుగుతున్న బెంగాల్ టైగర్!
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
జస్ట్ 3 వేలు పెట్టుబడి.. ఈ పంటతో లక్ష కొల్లగొట్టొచ్చు..
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
అదృష్టం కలసొచ్చింది.... అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
ఇరాన్ వైమానిక దళానికి భారీ దెబ్బ..!
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ? అయితే ఈ సమస్యలు తప్పవు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
పదో తరగతి అర్హతతో డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
కాస్త కొత్తగా.. కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ!
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం