గిన్నీస్ రికార్డు సాధించిన తొలి మహిళా దర్శకురాలు ‘విజయనిర్మల’

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల, కాంటినెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. సూపర్‌స్టార్ కృష్ణకు విజయనిర్మల భార్య. నటుడు నరేష్‌కి తల్లి. విజయనిర్మల మృతితో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికిని వ్యక్తం చేస్తున్నారు. నటిగా దర్శకురాలిగా తనదైన బాణిని పలికించారు. 44 పైగా చిత్రాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా ఆమె గిన్నీస్ […]

గిన్నీస్ రికార్డు సాధించిన తొలి మహిళా దర్శకురాలు 'విజయనిర్మల'
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2019 | 2:07 PM

ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మృతి చెందారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల, కాంటినెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు. సూపర్‌స్టార్ కృష్ణకు విజయనిర్మల భార్య. నటుడు నరేష్‌కి తల్లి. విజయనిర్మల మృతితో పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికిని వ్యక్తం చేస్తున్నారు.

నటిగా దర్శకురాలిగా తనదైన బాణిని పలికించారు. 44 పైగా చిత్రాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు. అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా ఆమె గిన్నీస్ రికార్డు సాధించారు. విజయనిర్మల బాల్యంలో పాండురంగ మహత్యం చిత్రంలో బాలకృష్ణుడిగా నటించి వావ్ అనిపించారు.

రంగుల రాట్నం చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా మారారు. మీనా చిత్రం ద్వారా దర్శకురాలిగా మారారు. భార్యాభర్తలిద్దరూ కలిసి 50 చిత్రాల్లో నటించారు. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు వంటి చిత్రాలు రజతోత్సవాలు కూడా జరుపుకున్నాయి.

విజయనిర్మల అసలు పేరు నిర్మల. అయితే తనకు సినీ రంగంలో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని ఆమె పేరు మార్చుకున్నారు. బాలనటిగా కేరీర్ ప్రారంభించిన విజయనిర్మల అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత మెగాఫోన్ చేపట్టి అత్యధిక సినిమాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్‌బుక్‌లో స్థానం సాధించారు.

సాక్షి చిత్రంలో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఆమె నటించారు. తెలుగు, తమిళం, మలయాళంలో 200లకు పైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణా పతాకంపై 15కు పైగా చిత్రాలను నిర్మించారు. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమెకు అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు వంటి చిత్రాలలో ఆమె అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నారు.

చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!