ఐపీఎల్ 2020: ఈ ఏడాది సన్‌రైజర్స్ జోరు కొనసాగేనా..!
2012 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అదరగొడుతోన్న ఎస్‌ఆర్‌హెచ్.. ఒకసారి టైటిల్‌ను గెలవడంతో పాటు మరోసారి రన్నరప్‌గా..
Sunrisers Hyderabad: 2012 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అదరగొడుతోన్న ఎస్‌ఆర్‌హెచ్.. ఒకసారి టైటిల్‌ను గెలవడంతో పాటు మరోసారి రన్నరప్‌గా.. మూడుసార్లు టాప్ 4లో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచిన సన్‌రైజర్స్‌కు బౌలింగే పెద్ద బలం. ఇక ఈ ఏడాది కప్ గెలిచేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మరి ఓసారి ఆ జట్టు బలాలు, బలహీనతలు ఇప్పుడు చూద్దాం.
వార్నర్, విలియమ్సన్, బెయిర్‌స్టో, నబీలు కీలకం..
సన్‌రైజర్స్‌కు వార్నర్, విలియమ్సన్, బెయిర్‌స్టోలు కీలక బ్యాట్స్‌మెన్. జట్టుకు ఓపెనర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా వార్నర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు. ప్రతీ సీజన్‌లోనూ 500 పైచిలుకు పరుగులు సాధిస్తూ 2015, 2017, 2019లలో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక విలియమ్సన్, బెయిర్‌స్టోలు జట్టుకు పెద్ద బలం. వీరిద్దరూ మంచి ఫామ్ కొనసాగిస్తే ప్రత్యర్ధులకు చుక్కలే. ఆ తర్వాత మనీష్ పాండే, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, ప్రియం గార్గ్, విరాట్ సింగ్ రూపంలో దేశీ ఆటగాళ్లు పుష్కలంగా ఉన్నారు. ఆల్ రౌండర్ల విషయానికి వస్తే.. మహమ్మద్ నబీ, మిచెల్ మార్ష్‌లు ఉండనే ఉన్నారు.
బలమైన బౌలింగ్ లైనప్…
ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న జట్టు సన్‌రైజర్స్. తక్కువ స్కోర్లు చేసిన మ్యాచులను కూడా బౌలర్ల వల్ల విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ సారధ్యంలో ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థంపి వంటి యువ బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ వస్తున్నారు. ఇక వీరికి తోడు మిచెల్ మార్ష్, బిల్లీ స్టాన్‌లేక్, రషీద్ ఖాన్‌లు ఉన్నారు.
బలహీనతలు:
సన్‌రైజర్స్‌కు మిడిల్ ఆర్డర్ చాలా ఇబ్బందికరం అంశం. మనీష్ పాండే, సాహా, శంకర్, అభిషేక్‌శర్మలలో ఒక్కరు కూడా ఇప్పటివరకు ఫినిషర్ పాత్ర పోషించలేకపోయారు. బ్యాటింగ్ లైనప్ ఎక్కువగా వార్నర్, బెయిర్‌స్టో, విలియమ్సన్‌లపైనే ఆధారపడి ఉంది. అటు ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఉండటం ఈ జట్టుకు మరో మైనస్.
సన్‌రైజర్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మొహమ్మద్ నబీ, మిచెల్ మార్ష్, ఫాబియన్ అలెన్, రషీద్ ఖాన్, బిల్లీ స్టాన్‌లేక్, మనీష్ పాండే, శ్రీవత్స గోస్వామి, వృద్ధిమాన్ సాహా, ప్రియం గార్గ్, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, బవనక సందీప్, సంజయ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, షాబాజ్ నదీమ్, ఖలీల్ అహ్మద్, తంగరసు నటరాజన్, బాసిల్ థంపి, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
Invaluable advice from the legend ?@VVSLaxman281 | #OrangeArmy #KeepRising #IPL2020 #Dream11IPL pic.twitter.com/UUxw9Us8hi
— SunRisers Hyderabad (@SunRisers) September 16, 2020