
Suma Instagram: సుమ కనకాల.. ఈ పేరు తెలియని సగటు సినీ, బుల్లి తెర ప్రేక్షకుడు ఉండడనంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదేమో. తనదైన పంచ్ డైలాగ్‌లు, సమయస్ఫూర్తిగా కూడిన చతురతతో ఆకట్టుకోవడంలో సుమకు సాటి ఎవరూ లేరు. ఏ ప్రోగ్రామ్ అయినా సరే సుమ ఉంటే వినోదానికి ఢోకా ఉండదు. బుల్లి తెరపై ఆకట్టుకునే సుమ.. సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ధైర్యాన్నినింపే ఉద్దేశంతో సుమ.. ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందుకోసం సుమ.. తన భర్త రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌ను వాడుకున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సై సినిమాలో రాజీవ్ కనకాల రక్బీ కోచ్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్‌లో ప్లేయర్స్‌లో ధైర్యాన్ని నింపేందుకు గాను.. రాజీవ్ ఒక డైలాగ్ చెబుతారు గుర్తింది కదూ.! అదే డైలాగ్‌ను కాపీ కొట్టారు సుమ. సినిమాలోని డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. కరోనా సమయంలో ధైర్యాన్ని కోల్పోకూడదని సూచించారు. అందరు ధైర్యంగా ఉండాలని.. ఎప్పుడైతే భయపడతామో మనలోని ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది. భయపడకుండా ఉండాలంటే.. మంచి విషయాలు వినండి, భయపెట్టే వాటిని చూడకండని చెప్పుకొచ్చారు సుమ.
Viral: విమానంలో భార్యాభర్తల ముద్దులాట.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!