యంగ్ హీరో సుధీర్ బాబు జోరు పెంచారు. ఇటీవలే ‘పలాస’ దర్శకుడు కరుణ కుమార్‌తో శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను అనౌన్స్ చేసిన సధీర్..తాజాగా మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో మరో సినిమా చేయబోతున్నాడు ఈ యంగ్ హీరో. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రాన్ని దీపావళి కానుకగా అధికారికంగా ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబోలో ”సమ్మోహనం, V” సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే
సుధీర్ బాబు కోసం డిఫరెంట్ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ.. ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని ప్రణాళికలు రచిస్తున్నారట. బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్రం రూపొందనుంది. చిత్రంలో సుధీర్ బాబు సరసన ‘ఉప్పెన’ లో నటించిన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించబోతున్నారు.
రొమాంటిక్ డ్రామాగా ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్న ఈ మూవీపై అటు ఇంద్రగంటి, ఇటు సుధీర్ బాబు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారట. అదేవిధంగా ఈ మూవీ లిరిక్స్‌పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన ఇంద్రగంటి.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రిలకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. సుధీర్ బాబు కెరీర్‌లో 14వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్ మీదకు రానుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనుంది చిత్రయూనిట్.
We are overjoyed to announce our PRODUCTION NO 1 #Sudheer14, directed by the visionary #MohanaKrishnaIndraganti Sir, starring the stellar actor @isudheerbabu and latest sensation @iamkrithishetty@mahendra7997 @kiranballapalli @pgvinda #VivekSagar #RRaveendar#MarthandKVenkatesh pic.twitter.com/woTjaGHbNb
— Benchmark Studios (@benchmarkstudi5) November 14, 2020
Also Read :
అక్రమ సంబంధం : భర్తను వదిలేసింది, నాలుగేళ్ల కుమారుడిని చంపేసింది
హైదరాబాద్‌లో పండుగ పూట రెచ్చిపోయిన దొంగలు..రూ.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లను దోచేశారు
. మేడపై నుంచి 14 రోజుల బిడ్డను కిందకు పడేసిన తల్లి..కనీసం కడుపు తీపి లేకుండా..?