ఆన్సర్ షీట్‌తో పరారైన ఇంటర్ విద్యార్థి అరెస్ట్

ఇంటర్‌ పరీక్షల ఆన్సర్‌ షీట్‌తో పరారై తప్పించుకుని తిరుగుతున్న విద్యార్థిని హైదరాబాద్‌లో రైన్‌బజార్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 9న ఇస్లామియా కాలేజీలో ఇంటర్ మ్యాథ్స్ ఎగ్జామ్‌కు హాజరైన మహ్మద్ హుజేఫ్ అహ్మద్.. తన ఆన్సర్ షీట్‌ ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. గుర్తించిన ఇన్విజిలేటర్ అదేరోజు రైన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి ఆన్సర్‌ షీట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

  • Anil kumar poka
  • Publish Date - 1:24 pm, Wed, 12 June 19