AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ ఛీ కొట్టింది.. పాక్ ముద్దంది.. కట్ చేస్తే.. 33 ఫోర్లు, 17 సిక్సర్లతో టాపులేపాడు.. ఎవరంటే.?

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పీఎస్ఎల్ 2026లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ తరపున ఆడుతూ అతడు చేసిన ఈ వీరోచిత ఇన్నింగ్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి.

ఐపీఎల్ ఛీ కొట్టింది.. పాక్ ముద్దంది.. కట్ చేస్తే.. 33 ఫోర్లు, 17 సిక్సర్లతో టాపులేపాడు.. ఎవరంటే.?
Cricket
Ravi Kiran
|

Updated on: Apr 23, 2026 | 11:56 AM

Share

క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ స్మిత్.. పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సాధారణంగా టెస్టు స్పెషలిస్ట్‌గా పేరున్న స్మిత్, టీ20 ఫార్మాట్‌లోనూ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. హైదరాబాద్ కింగ్స్‌మెన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో స్మిత్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ముల్తాన్ సుల్తాన్స్‌ తరపున ఆడుతున్న స్మిత్, మైదానం నలుమూలలా క్లాసిక్ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 47 బంతుల్లోనే తన కెరీర్‌లో మొట్టమొదటి పీఎస్ఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో స్మిత్ తన ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లు, ఫ్లిక్ షాట్లతో అలరించాడు. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ, భారీ స్కోరు సాధించడంలో తన జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ఒక టెస్ట్ బ్యాటర్ టీ20ల్లో ఇంత దూకుడుగా ఆడటం చూసి స్టేడియంలోని అభిమానులు ఫిదా అయిపోయారు. మొత్తంగా 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 50 బంతుల్లో 106 పరుగులు చేసిన స్మిత్.. కేవలం ఒక్క ఓవర్‌లోనే 28 పరుగులు రాబట్టడం విశేషం.

ముఖ్యంగా కరాచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించడం ఒక విశేషం. ఈ అరుదైన ఫీట్ సాధించిన వెంటనే మైదానమంతా స్మిత్ నామస్మరణతో మారుమోగిపోయింది. గతంలో టీ20ల్లో స్మిత్ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వచ్చినప్పటికీ, ఈ సెంచరీతో వాటన్నింటికీ అతడు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఏకంగా 212 స్ట్రైక్ రేటుతో బాదేశాడు. అయితే చివర్లో విజయం మాత్రం హైదరాబాద్ జట్టును వరించింది. ఇక ముల్తాన్ సుల్తాన్స్ ఇప్పటిదాకా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి.. అందులో ఆరు గెలిచి 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, టీ20ల్లో స్మిత్‌కు ఇది ఆరో సెంచరీ. ఆస్ట్రేలియా తరపున ఒలింపిక్స్ 2028లో పాల్గొనడమే అతడి లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

అటు మ్యాచ్ అనంతరం ప్రపంచంలోని అత్యుత్తమ లీగ్‌లలో పీఎస్ఎల్ ఎక్కడ ఉంటుందనే ప్రశ్నకు స్మిత్ ఆసక్తికరంగా స్పందించారు. “ఇక్కడ చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇదొక నిజంగా మంచి లీగ్. ఇక్కడ అపారమైన ప్రతిభ(టాలెంట్) దాగుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు” అని అతడు పేర్కొన్నాడు. బౌలింగ్ విభాగంలో కూడా అన్ని జట్లలో నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారని అతడు ప్రశంసించాడు. ముల్తాన్ సుల్తాన్స్ జట్టులో తన ఓపెనింగ్ భాగస్వామి సాహిబ్జాదా ఫర్హాన్‌ గురించి స్మిత్ ప్రత్యేకంగా మాట్లాడాడు. “మా జట్టులో చాలా మంది నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో సాహిబ్జాదా ఫర్హాన్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను గేమ్‌ను ముందుకు తీసుకెళ్లే తీరు అద్భుతం. మేమిద్దరం మైదానంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఆడుతున్నాం” అని స్మిత్ వివరించారు.

ఇది చదవండి: మీ భూమి కబ్జాకు గురైందా? ఆస్తిని తిరిగి దక్కించుకోవడం ఈజీ.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

Follow Us