స్పేస్ బెలూన్ క్యాప్స్యూల్ తో అంతరిక్షంలోకి.. అమెరికా స్టార్టప్ ప్రయోగం..

యూఎస్ కు చెందిన ఓ స్టార్టప్  కంపెనీ అంతరిక్షంలో నుంచి భూమిని సందర్శించాలనుకునే ఔత్సాహికుల కోసం సరికొత్త టూరిజం ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా దీనికోసం స్పేస్ బెలూన్ క్యాప్స్యూల్‌ను కూడా

స్పేస్ బెలూన్ క్యాప్స్యూల్ తో అంతరిక్షంలోకి.. అమెరికా స్టార్టప్ ప్రయోగం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 04, 2020 | 10:20 PM

యూఎస్ కు చెందిన ఓ స్టార్టప్  కంపెనీ అంతరిక్షంలో నుంచి భూమిని సందర్శించాలనుకునే ఔత్సాహికుల కోసం సరికొత్త టూరిజం ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా దీనికోసం స్పేస్ బెలూన్ క్యాప్స్యూల్‌ను కూడా సృష్టిస్తోంది. సాధారణంగా ప్రెజరైజ్ట్ బెలూన్లు అనగానే కొండ ప్రాంతాల్లో అలా అలా కొంత ఎత్తులో ఎగిరి తిరిగి కిందకొచ్చేస్తాయి. అయితే ఈ స్పేస్ బెలూన్లు మాత్రం భూమి నుంచి అక్షరాలా లక్ష అడుగుల ఎత్తుకు తీసుకెళతాయి. అక్కడి నుంచి భూమిని చూస్తే ఆ మజానే వేరని సంస్థ ధీమాగా చెబుతోంది.

కాగా.. ఒక్కో ట్రిప్ ఆరుగంటల పాటు కొనసాగుతుందని, ఆ సమయంలో బోర్ కొట్టకుండా ఓ బార్‌ను కూడా ఏర్పాటు చేయనున్నామని సంస్థ చెబుతోంది. ఈ స్పేస్ బెలూన్ క్యాప్స్యూల్‌ను వచ్చే ఏడాది ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి పంపనున్నట్లు సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ ట్రిప్‌కు అయ్యే ఖర్చు కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఒక్కో టూరిస్టు లక్ష ఇరవై ఐదు వేల డాలర్లు(రూ.93.34.931) చెల్లించుకోవాల్సి ఉంటుంది.