బీజేపీ ఎన్నికల ప్రచారంలో కుప్పకూలిన స్టేజ్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి దొర్లింది. సంబాల్లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కెపాసిటీకి మించి నేతలు స్టేజ్ పైకి ఎక్కడంతో ప్రమాదం జరిగింది. పార్టీ నేతలు ప్రసంగిస్తున్న సమయంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. సంబాల్‌ల్లో స్టేజ్ కూలిన ఘటనలో చాలామంది గాయపడ్డారు. బీజేపీ కిసాన్ మోర్చానేత అవదేశ్ యాదవ్ కాలు విరిగింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. సంబాల్ ఆస్పత్రిలో అవదేశ్ యాదవ్‌కు చికిత్స జరుగుతోంది. నేతలు పోటీ పడి […]

బీజేపీ ఎన్నికల ప్రచారంలో కుప్పకూలిన స్టేజ్

Edited By:

Updated on: Mar 23, 2019 | 10:01 AM

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి దొర్లింది. సంబాల్లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతల స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కెపాసిటీకి మించి నేతలు స్టేజ్ పైకి ఎక్కడంతో ప్రమాదం జరిగింది. పార్టీ నేతలు ప్రసంగిస్తున్న సమయంలో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.

సంబాల్‌ల్లో స్టేజ్ కూలిన ఘటనలో చాలామంది గాయపడ్డారు. బీజేపీ కిసాన్ మోర్చానేత అవదేశ్ యాదవ్ కాలు విరిగింది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. సంబాల్ ఆస్పత్రిలో అవదేశ్ యాదవ్‌కు చికిత్స జరుగుతోంది. నేతలు పోటీ పడి వేదిక పైకి ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంతో పాటు సంబాల్‌లో హోళీ మిలాప్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దీంతో.. భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు హాజరయ్యారు.